నా ఇల్లాలి ఫ్యామిలి 56
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 56 అనుకున్నట్టుగానే డ్రైవరు వేగానికి గంటలో ఇంటికి చేరుకున్నారు అందరూ . సొంత ఇంటిలోకి అడుగుపెట్టినట్టు ఎగిరి లోపలికి దూకింది నా కూతురు . తన ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ భార్యా భర్తలు ఇద్దరూ తన వెనకాలే ఇంట్లోకి వెళ్లారు .
“ఇంకా నీ యూనిఫోర్మ్ లోనే ఉన్నావు . అదిగో నీ గది , నీకోసం అంతా సర్ది పెట్టాను . స్నానం చేసుకొని రా , భోజనం వడ్డిస్తాను ” అని గది చూపించింది అత్త
“నీ బ్యాగు లోపల పెట్టేశాను . నీ ఇల్లే అనుకో , అస్సలు మొహమాట పడకు . అంతా అయ్యాక భోజనం చేద్దాం ” అని చెప్పాడు మేనమావ
“నా ఇల్లే అనుకోమంటే రేపు నిజంగా ఆస్తి పంపకాలు కూడా అడుగుతాను , ఆ తరువాత మీ ఇష్టం మామయ్య ” అని నవ్వేసి గదిలోకి వెళ్లిపోయింది నా కూతురు .
తన వైపే చూస్తూ ఉండిపోయిన భర్తని కదిపి “ఏంటండీ , ఆలోచిస్తున్నారు ?” అని అడిగింది చెల్లి
“అక్క గుర్తొచ్చింది తనని చూస్తుంటే ” అని సమాధానం