ముగ్ద 2
telugu stories kathalu novels ముగ్ద 2 'వదలవలసిన రాత్రా ఇది? జన్మంతా గుర్తుండిపోయే మధురమైన రాత్రి' నెమ్మదిగా ఆమెను నడిపించుకుంటూ మంచం దగ్గరగా తీసుకువచ్చాడు. పరిచి వున్న మల్ల మొగ్గలు మూలగా మూలిగాయి. కదంబమాలలు మాత్రం వాటి అవస్థ చూసి ఫక్కున నవ్వాయి. 'మీరు పాపం! నలిగిపోక తప్పదీ రాత్రి. పోన్లేండి మధుర లాలసల్ని వీక్షిస్తూ ఊగుతూ, తూగుతూ మేమీ రాత్రి జాగరణ చేస్తాం. అలసిపోయిన జంటకి హాయినిచ్చాం అన్న తృప్తి మీకు మిగులుతుంది! నచ్చచెప్పాయి.
దిండు పక్కన వున్న బల్లమీద మిఠాయిల్లోంచి కాకినాడ కాజా తీసి ఆమె నోటికందించాడు.
"ఊహు! వద్దు” ముఖం తిప్పుకుంది కస్తూరి. శంఖం లాంటి చెవికి వున్న ముత్యాల జూకాలు అందంగా కదిలాయి.
"అదేమి! నాకూ వద్దులే పక్కన పెట్టేశాడు తిలక్. "అది కాదు మీరు తినండి”
'నాకు ఆ స్వీట్స్ తో పనేం లేదింక. అమృతం నాకోసం ఇక్కడ ఎదురుచూస్తోంది కదా!” చూపుడువేలుతో ఆమె లేత గులాబీ పెదవుల మీద రాశాడు.
తల వంచుకుంది కృతి.
“ఇదంతా సిగ్గే!”
"కాదు” వెంటనే అంది కృతి.
ఆశ్చర్యపోయాడు తిలక్ ఆ సమాధానానికి.
'మీతో నేనో విషయం చెప్పాలి' ధృడంగా వుంది కృతి కంఠస్వరం. ఆమెనే చూస్తున్నాడు తిలక్. 'నాకు...నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. షాక్ తిన్నాడు తిలక్.
“మరి ముందు ఎందుకు చెప్పలేదు?'. 'నన్నెవరూ అడగలేదు. ఎలా చెప్పను?' ఎదురు ప్రశ్నించింది కృతి.
“అంటే...నాతో పెళ్ళిష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టంలేదా!' కొద్దిగా దూరం జరిగాడు తిలక్.
మాట్లాడలేదు కృతి.
“చెప్పుకృతీ! మన రెండు జీవితాలూ పెనవేసుకోవాలన్నా, విడిపోవాలన్నా ఈ రాత్రే పునాది. నీ నిర్ణయం ఏదైనా నేను వినడానికి సిద్ధంగా వున్నాను' బాధని మనసులోనే అదిమి