ముగ్ద 1
telugu stories kathalu novels ముగ్ద 1 అత్తరు గుబాళింపుతో వాతావరణం మత్తుగా, గమ్మత్తుగా వుంది. పందిరి మంచం దూలాలకి కట్టిన మల్లెపూదండలు, కదంబమాలలు పిల్లగాలికి నెమ్మదిగా ఊగుతున్నాయి. పూలరథంలా వుంది పట్టుపాన్పు.
కిటికీలకి కట్టిన లేత నీలిరంగు జలతారు తెరల్ని ఓరగా ఒత్తిగిలించి బైటికి తొంగి చూశాడు తిలక్. పగటిని మరిపించేంత పండువెన్నెల. అర్ధరాత్రి పూట కూడా మినుకు మినుకుమంటున్న దీపాల్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు.
'రేపటినుంచీ నా ఇంట్లోనూ నడిరేయిలో చిరుదీపం అలా వెలుగుతూనే వుంటుంది కదా.. అనుకుంటూ ఆకాశం వైపు చూశాడు. ఎక్కడా ఒక్క చిరుమేఘం కూడా లేని ప్రశాంత గగనం. నీలిరంగు వెల్లవేసిన సీలింగ్ కి కట్టిన పెట్రోమాక్స్ దీపంలాగా నిండు జాబిల్లి చందమామ నా సొంతం అంటే, నా సొంతం అంటూ పోటీలు పడుతూ, వెలుగుతూ ఆరుతూన్న నక్షత్ర కన్యలు, పిల్ల తెమ్మెర మోసుకొస్తూన్న మొగలిపూల సుగంధం.
అంతటి చల్లని వాతావరణంలోనూ తిలక్ ధరించిన లాల్చీ చెమటతో తడిసిపోతోంది. ఎగసి పడుతున్న గుండె చేసే ధ్వని స్పష్టంగా విన్పిస్తుంది.
ఛీ! మగాణ్ణి, మొనగాణ్ణి, నాకేమిటింత టెన్షన్? అరేయ్ తిలక్! డోంట్ గెట్ టెన్షన్ రిలాక్స్ తనకి తానే ఆదేశాలిచ్చుకోసాగాడు. పాతకాలం ఫాను కొద్దిగా చప్పుడు చేస్తూ వేగం పెంచుకుంది.
టైం చూసుకున్నాడు తిలక్. పదకొండూ ముప్పై అయిదు. సరిగ్గా నిన్న ఇదే సమయానికి కృతి పచ్చని మెడలో తను మూడుముళ్ళూ వేశాడు. అరచెయ్యి మందాన వున్న జడచాటుగా తను పెట్టిన గిలిగింతలకి ఒక ప్రక్క నవ్వుతూనే, దానిని ఆపుకునేందుకు వృధాప్రయత్నం చేస్తూ ఆమె చిరుకోపంగా