మొండి 78 ప్రమాదం
telugu stories kathalu novels మొండి 78 ప్రమాదం దాన్నుండి కాపాడే విరుగుడు దొరికిపోయింది... వీరు కి చాలా ఆనందంగా ఉంది... "విన్నావా.. బోరాన్ sulphuric dioxide"
నజీరుద్దీన్ కి అప్పటికే కొంత రేడియేషన్ పాకేసింది... కానీ నెమ్మదిగా కొలుకుంటున్నాడు... ఒక రెండు మూడు గంటలు పడుతుంది...
" వీడిని మామూలుగా చంపకూడదు... ఒక్కొక్క మాంసం ముక్క తీసి తీసి చంపాలి"
లహాజా వచ్చి వీరు దగ్గర కూర్చున్నాడు .
వీరు కి తన టైం అయిపోయిందని అర్ధం అయిపోయింది...
కత్తి తీసి వీరు.. కుడి చెయ్యి మీద పెట్టి గొర్రెని కోసినట్టు వీరు కుడి చేతి కండరాన్ని కోసాడు... కండ బయటకు వాచ్చేలా కోసాడు...
వీరు నొప్పి తట్టుకోలేక భయంకరంగా అరుస్తున్నాడు... ఇక దివ్య వినలేకపోయింది... హెడ్ సెట్ తీసేసి... పెట్టింది..కనీసం ఇందాక దాకా గుండె ఆగిపోయేంత స్పీడ్ గా కొట్టుకుంటోంది.. ఇప్పుడు ఆ స్పీడ్ కూడా లేదు దివ్య గుండెలో... ఏడువు కూడా రావడం లేదు...ముక్కు గాలి కూడా వేడిగా అనిపిస్తోంది దివ్య కి... ఉన్నట్టుండి హెడ్ సెట్ లోని స్పీకర్ లో పిస్టల్ శబ్దం వినపడింది... హెడ్ ఫోన్ లో మెషిన్ దెబ్బతిన్న కనెక్షన్ కట్ అయినట్టుగా