మొండి 76 చివరి సారి
telugu stories kathalu novels మొండి 76 చివరి సారి అనుకోకుండా అబ్దుల్ చనిపోవడం తో వీరు ఆశలు అన్నీ గల్లంతయ్యాయి... ఇప్పుడు అసలు లింక్ ఎవరితో ఉందొ కనుక్కోవడం అస్సలు అర్ధం కావట్లేదు.... ఎటు నుంచి చూసినా దారులు అన్నీ మూసుకుపోయాయి...
" జరగ కూడనివి అన్నీ జరిగిపోయాయి... ఇన్నేళ్ల కష్టం మొత్తం వృధా గా అయిపోయింది.."
" ఇలాంటప్పుడే ఏదైనా కొత్త ఐడియా వస్తుంది వీరు...కొంచుం బ్రెయిన్ వాడు.." అంది దివ్య
రాజేష్ కి కూడా ఏమి అర్ధం కావడం లేదు....
వీరు: " ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది.. అసలు నిన్నెవడు వాడితో మాట్లాడుతుంటే పక్కకి రమ్మంది" అని దివ్య ని తిట్టాడు...
దివ్య ఏమి సమాధానం చెప్పకుండా నిలబడిపోయింది..
" వీరు" అని ఆపాడు రాజేష్
రాజేష్: " వాడికి ఒక్క రాయి తగిలితేనే... వాడు ఇలా లోపల కాలిపోయి చనిపోయాడు కదా... "
వీరు: " అవును... అయితే... "
రాజేష్: " ఒక వేళ వీళ్ళ ప్లాన్ కూడా ఇదే ఏమో... "
వీరు: " అంటే?"
రాజేష్: " ఇండియా మొత్తం జరుగుతుంది అన్నాడు.. ఈ వాటర్ తాగిన జనం గంటల్లో, నిమిషాల్లో చనిపోతారేమో... అలాగే అది పూడ్చిన భూమి ఇలా ఎండిపోయి, వీక్ అయిపోయి బిల్డింగ్స్ కూలిపోతాయి ఏమో..?"
వీరు , దివ్య కి బల్బ్ వెలిగింది...
" రాజేష్... నాకు పరిచయం అయినప్పటి రాజేష్ ని చూస్తున్నా ఇవాళ... కరక్టే.. కానీ.. మరి ఏ ఊర్లలో ఎక్కడ పెడుతారో మనకెలా తెలుస్తుంది మనం ఎలా