మొండి 71 సత్యం
telugu stories kathalu novels మొండి 71 సత్యం దివ్య ఏమి చెప్తుందో అని ఎదురు చూస్తున్నారు... వీరు, సత్యం
" నా గురించి నీకు కొంచుం కూడా డౌబ్ట్ రాలేదా వీరు"
" రాలేదు... "
" కనీసం నువ్వు ఆ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చినప్పుడు, ఏమి చేస్తున్నానో కనిపించలేదా..నీకు రక్తం వస్తోంది అని కూడా అడగలేదు నేను... ఎందుకో ఆలోచించావా?"
" ఇప్పుడు మొదటి సారి అడుగుతున్నా దివ్య... అసలు ఎవరు నువ్వు.. మీ నాన్నకి NIA కి ఏంటి సంబంధం.. "
చెప్పడం మొదలుపెట్టింది దివ్య...
" నిజాం పాలన చేసేటప్పుడు కొన్ని కుటుంబాలకు వంశ పారంపర్యంగా గూడాచార బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది . వారి పాలనలో 150 ఏళ్ళు మా కుటుంబం గూడాచారులుగా పనిచేశారు... దాంట్లో 13 వ తరం మా తాతయ్యది వచ్చింది.. ఇండియన్ ఆర్మీ కి , నిజాం కి మధ్యలో యుద్ధం జరిగింది.. నిజాం సైన్యం ఎంత ఓడిపోయినా... ఇండియన్ ఆర్మి ముందుకు కదలడం కష్టం అయ్యింది... కారణం ఏంటో కనుక్కుంటే, మా తాతయ్య అందిస్తున్న గూడాచార సమాచారం వల్లనే అని అర్ధం అయ్యింది... హైదరాబాద్ సంస్థాన విలీనం అయ్యాక... గూడాచారులు చాలా మందిని ఉరి తీయడం జరిగింది.. కానీ, మా తాతయ్య గారి నైపుణ్యాన్ని గమనించి , ఆయనని ఇండియన్ గవర్నమెంట్ కి పని చెయ్యమని స్వాగతించారు... మా వంశం గూడాచారులుగా ఉపయోగపడినంత కాలం , ఇండియన్ గవర్నమెంట్ మాకు స్పెషల్ ప్రివిలీజెస్ ఇచ్చింది.. ఎప్పుడు కావాలనుకున్నా ఎంత పెద్ద ఆఫీస్ నైనా కలవొచ్చు మాట్లాడొచ్చు.. అందులో చివరి తరం నాన్నది.. "
" సో అంకుల్ ఇండియన్ స్పై ఆ... "
" అవును.. కానీ.. ఆయనకు కూడా టెక్నాలజీ అంటే ఇష్టం.. విదేశాలకు వెళ్లి వస్తా అని అప్పడు ప్రధానిని అడిగితే వెళ్లొచ్చు కానీ, మీ వంశం బాధ్యత మరిచిపోకండి అని చెప్పాడు... ఇలా అయితే కష్టం అని, హ్యాకింగ్ మెదలుపెట్టాడు... ఇలా అయిన ఇండియాకి ఉపయోగపడొచ్చు .. తిరగాల్సిన అవసరం