మొండి 70 ప్రశ్నలు
telugu stories kathalu novels మొండి 70 ప్రశ్నలు వీరు కి బాధ కన్నీళ్లు ఒకే సారి వచ్చాయి... తనకి ఇష్టమైన వాళ్ళందరూ ఒక్కొక్కరే మాయం అయిపోతున్నారు... నిజంగా ఈ పరిస్థితికి తానే కారణమా లేదా ఆకా అవుతుందో అర్ధం కావడం లేదు.... దివ్య కూడా ఇలానే దూరం అయితే అన్న బాధ భయం ఒకటి మనసులో మొదలైంది...
సరిగ్గా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన 3 రోజులకి వీరు ని ఆఫీసుకి పిలిచి చివాట్లు పెట్టారు అందరు సభ్యులు...
వీరు ని డైరెక్ట్ గా బాస్ పిలిచాడు..
" మీడియా, నేషనల్ బోర్డ్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరి దగ్గరా మన పరువు పోయింది... ఇక నేను ఎలా తల ఎత్తుకుని తిరగాలి."
" సార్..."
" రిజైన్ చేసేయ్ వీరు... నీకు టాలెంట్ ఉంది కానీ, సిస్టం లో పని చెయ్యడం చేతకాదు... నీకు లైఫ్ లో డిసిప్లీన్ కావాలి... "
వీరు ఇంకొక మాట మాట్లాడకుండా రిజైన్ చేసి వచ్చేశాడు... చివరగా ఆఫీసు వదిలివెళ్ళేటప్పుడు బాధగా చూసి వచ్చేశాడు.. లోలోపల వీరు కి కూడా అక్కడ ఉండటం ఇష్టం లేదు... ఇంకోపక్కన "ఆ ఏరియా కి వెళ్లాల్సింది నేను... అనవసరంగా సార్ ని పంపాను" అని బాధ... బయటకు వచ్చాడే కానీ, లోలోపల పగ చల్లారట్లేదు... వాళ్ళని ఎలాగైనా వదిలిపెట్టకూడదు...
అందుకే రాత్రిళ్ళు తన అండర్ గ్రౌండ్ ఆఫీసు లో పని ఎక్కువ చెయ్యడం మొదలుపెట్టాడు... ఇప్పుడు తన ముందు టార్గెట్ ని క్లియర్ గా సెట్ చేసుకున్నాడు...
1. బ్లాక్ స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
2. తన అకౌంట్ లో డబ్బులు ఎలా పడ్డాయి?
3. దేబెంద్ర సార్ మరణం వెనుక కారణం ఏంటి?
4. ఆయన ఇచ్చిన ఐడీ పాస్వర్డ్ దేనికి?
పొద్దున్న పూట తన సొంత సాఫ్ట్వేర్ కంపెనీ లో బాస్ గా, రాత్రిపూట హ్యాకర్ గా తనకు కావాల్సిన సమాచారం వెతుకుతున్నాడు....
4 వ రోజు రాత్రి అతనికి మొదటి లింక్ దొరికింది... తన అకౌంట్ లోకి 3 కోట్లు డబ్బులు వేసింది ఒక బిట్ కాయిన్ అకౌంట్ నుండి అని గుర్తుపట్టాడు... అది ఎక్కడా? అని ట్రేస్ చేస్తే నైజీరియా కి దగ్గర్లో ఉన్న సర్వర్ అని అర్ధం అయ్యింది... మామూలుగా హ్యాకర్లు వాళ్ళు ఉండే దేశాల్లో సర్వర్లు వాడరు... ఏ సింగపూర్ లేదా