మొండి 7 డార్క్ వెబ్
telugu stories kathalu novels మొండి 7 డార్క్ వెబ్ "డార్క్ వెబ్" అన్న మాట రవి సార్ నోటి నుండి ఎప్పుడు వెలువడిందో గాని, వీరు జీవితం ఆ క్షణం నుండి, మారిపోయింది.
తను తెలుసుకోబోతున్న విషయం అతన్ని జివితం మొత్తం వెంటాడబోతోంది అని తెలియక, ఇంకా ఆసక్తిగా అడుగుతున్నాడు వీరు " అంటే ఏంటి" అని.
పక్కన ఎవరైనా ఉన్నారా అని స్టాఫ్ రూం మొత్తం చూసుకున్న తరువాత వీరు ని పిలిచి కంప్యుటర్ ముందు కుర్చోబెట్టుకున్నాడు, రవి.
" సింపుల్ గా చెప్తా విను. ప్రపంచం లో ఉన్న వెబ్సైట్లు అన్నీ ఎలా యాక్సెస్ చేస్తున్నాం ? అవి ఉన్నాయని మనకు ఎలా తెలుస్తోంది? "
" గూగుల్ ద్వారా వెతికితే "
" అదే మరి. గూగుల్ లిస్ట్ లో కనిపించనివి. ఏ సర్చ్ ఇంజన్ లో లేనివి వెబ్సైట్లు ఎన్ని ఉంటాయి?"
" దాదాపుగా ఉండవు కదా సార్ "
" అదే వీరు ఇక్కడ తేడా . మనకు తెలిసిన గూగుల్ , యాహు, అన్ని సర్చ్ ఇంజన్లు కలిపినా ప్రపంచం మొత్తం మీద ఉన్న వెబ్సైట్లు 10 శాతం కు మించి మనకు దొరకవు. గూగుల్ వాడి పాలసీ ప్రకారం కూడా కొన్ని రకాల వెబ్ సైట్లను సర్చ్ లో చూపించడానికి అనుమతించదు. "
" ఎలాంటి వెబ్సైట్లు లను అనుమతించరు ?"
" భయంకరమైన వెబ్ సైట్లు "
ఆ మాట తో రూమ్ లో కాసేపు నిశబ్దం ఆవరించుకుంది కాసేపు. నిశబ్దాన్ని ఛేదిస్తూ రవి సార్
" ముందు ఈ సిస్టం లోకి TOR బ్రౌసర్ ని డౌన్లోడ్ చెయ్ " అన్నాడు.
వీరు ఇంకొక మాట మాట్లాడకుండా TOR అనే బ్రౌసర్ ను వెతికి డౌన్ లోడ్ చేసాడు.
ఒక వెబ్ పేజీ ఓపెన్ చేసాడు." డార్క్ వెబ్ ని బ్రౌసింగ్ చెయ్యాలంటే ఈ బ్రౌసర్ ని వాడతారు"
" ఇది ఒక డార్క్ సర్చ్ ఇంజన్ వెబ్ సైట్ . లిస్ట్ చూస్తున్నావ్ గా ?" అని అడిగాడు.
ఒక్కో వెబ్ సైట్ ఒక్కో టైటిల్ తో ఉంది.
చైల్డ్ పోర్న్ ., అన్న మాట చూసి ఒక్క క్షణం మైండ్ పని చెయ్యడం మానేసింది వీరు కి.
" ఇలాంటి సైట్లు కూడా ఎవరు పెడతారు సార్ "
" ఇవే కాదు. ఇలాంటి సైకిక్ సైకిక్