మొండి 69 ఒక మరణం
telugu stories kathalu novels మొండి 69 ఒక మరణం తరువాత ఏమి జరిగింది....
" నేను ఏ కేసు టేక్ అప్ చేసినా ఒక్కడినే వెళ్లి మరీ తేల్చుకుని వచ్చే వాడిని... మొదటి సారి దీనికి టీం వర్క్ లేకుండా చెయ్యడం కష్టం అనిపించింది... "
" అయితే"
" వచ్చేసాను... హైరాబాద్ కి వచ్చి రిపోర్ట్ చేసాను... తప్పిపోయిన ఆ ఊరి జనాల తాలూకు ఇన్ఫోర్మేషన్ కనుక్కోమని ఒక కొత్త టీం ని పంపించాను... అదే సమయంలో నాకు ఆఫీసులో కొత్త విషయం తెలిసి షాక్ అయ్యాను"
" దివ్య దగ్గర ఉండాల్సిన రవి సార్ లాప్ టాప్... ఆఫీసులో కనపడింది... "
" అదేంటి"
" అదే మాట నేను డైరెక్ట్ గా ప్రొఫెసర్ దేబెంద్ర ని కలిసి ఆడిగాను"
******
" ఈ లాప్ టాప్ మన ఆఫీసులోకి ఎలా వచ్చింది"
" దివ్య దగ్గర ఈ లాప్ టాప్ ఉంది అంటగా"
" ఆమె మీకెలా తెలుసు"
" మాకు తెలియనివి ఏవి ఉండవు... కానీ.. ఆ లాప్ టాప్ గురించి మాకు ఎందుకు చెప్పలేదు.. ఎందుకు"
" రవి సార్ హత్య నా పర్సనల్... కేసు... ఆయన చావుకు ఒక అర్ధం ఉండాలి.. అందుకే టేక్ అప్ చేసాను..."
" నీకు బుద్ధి ఉందా వీరు... మన బలం ఏంటో మర్చిపోయావా... మనం ఉన్నామని అవతల వాళ్ళకి తెలియకుండా..... ఉండటమే"
" నిజమే సార్.. కానీ.. మన ఐడెంటిటీ వాళ్లకు ఇంకా తెలియలేదు కదా."
" నీ వల్ల ఒకవేళ ఆ అమ్మాయికి ఏమయ్యుంటుందో ఆలోచించావా.."
వీరు తల దించుకున్నాడు...
" ఏమైనా పురోగతి ఉందా.. మహారాష్ట్ర కేసులో.. ?"
వీరు సైలెంట్ గా కాసేపు ఉండి... జరిగినదంతా చెప్పాడు... ఆ ఊర్లో చూసినవన్నీ
"ఆ తరువాత" అని అడిగాడు సత్యం