మొండి 68 ఊరు
telugu stories kathalu novels మొండి 68 ఊరు
అసలు జరిగింది వేరు... అదంతా ఒక పెద్ద ప్లాన్ లో భాగం " అన్నాడు వీరు
" అదే ఏమి ప్లాన్?" అడిగాడు సత్యం
" ఎవ్వరూ ఊహించని ప్లాన్... అదే నాకు కూడా అర్ధం కావడం లేదు..."
" వీరు... ఇన్ని విషయాలు కనిపెట్టిన వాడివి ... అసలు ఏమి జరగబోతోందో తెలియదు అంటే నేను ఎలా నమ్ముతా?"
వీరు చెప్పడం మొదలుపెట్టాడు..."
" ఒక పక్కన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మాత్రమే నాకు ఆఫీసులో ఇవ్వడం మొదలుపెట్టారు.. ఒక విసుగొచ్చి నేను ఉద్యోగం మానేస్తా అని ప్రొఫెసర్ దేబెంద్ర దగ్గర ప్రపోసల్ పెట్టాను"
" పెట్టాక"
******
దేబెంద్ర: " ఎందుకు? "
వీరు. : " అది నేను అడగాల్సిన ప్రశ్న సార్. నన్ను ఇలా అన్ని ప్రాజెక్ట్స్ నుండి తప్పించి మీరేం చేద్దాం అనుకుంటున్నారు?"
దేబెంద్ర: " నిన్ను ఆపినా నీ పని మాత్రం ఆగదు అని నాకు తెలుసు కాబట్టి "
వీరు. : " మరి అలాంటప్పుడు ఆ లహాజా అసైన్మెంట్ నాకే ఇస్తే సరిపోతుందిగా"
దేబెంద్ర: " పెద్ద అసైన్మెంట్స్ ఎప్పుడూ నీకే ఇస్తున్నాం వీరు... నువ్వే రెక్లెస్ గా చేస్తున్నావ్ "
వీరు. : " అందుకే నేనీ ఉద్యోగానికి ఎందుకు ఫిట్ కాదని అనిపిస్తోంది"
దేబెంద్ర: " అది నువ్వు కాదు మేము అనుకోవాల్సిన మాట . చూడు వీరు..... ఇప్పుడు ఒకే సారి... నాలుగు పనులు చెయ్యాల్సిన టైం వస్తే నువ్వు అందుబాటులో లేకపోతే ఎలా"
వీరు కి దేబెంద్ర చెప్పింది సగం సగం అర్ధం అయ్యింది... ఏదో పెద్ద పని మీద తనని రిసర్వ్ లో ఉంచుతున్నారని....
కొన్నాళ్ళు ఆగాడు వీరు
ఒక రోజు పిలుపు వచ్చింది మెయిన్ ఆఫీస్