మొండి 65 ట్రాప్
telugu stories kathalu novels మొండి 65 ట్రాప్ లోపల కూర్చున్న వీరు.... మళ్లీ గతంలోకి వెళ్లి ఆలోచిస్తున్నాడు...
ఈ ప్రాబ్లెమ్స్ అన్నిటికీ కారణం అతనికి ఆ రోజు జరిగిన సంఘటన...
లహాజా నుండి ఆ మాటలు వీరుకి ఒళ్ళు గగుర్పొడిచేలా చేసాయి.. ఇండియా పైన ఇంత పెద్ద కుట్ర జరుగుతోందా.. అన్న భయం వీరు మనస్సుని కలచి వేసింది... ఆ సమయంలోనే "దివ్య నాతో మాట్లాడటం తగ్గించింది"..అన్న బాధ మనస్సులో నుండి పూర్తిగా వెళ్ళిపోయింది... వ్యక్తిగత బాధ్యత కన్నా దేశం అనే బాధ్యత తన మనసు నిండా మునిగిపోయింది...
ఆ రోజు నుండి ఆఫీసులో ప్రొఫెసర్ దేబెంద్ర తో టచ్ లో ఉండి ప్రాజెక్టుకి సంబందించిన వివరాలు ఒక్కొక్కటే బయటకు తీయడం మొదలుపెట్టాడు. పేరుకి మాత్రమే అతను సస్పెండ్ అయిన ఏజెంట్... ఎప్పటికీ అతను డ్యూటీ లో ఉన్న ఏజెంట్...ఏ...
దివ్య కి మధ్య మధ్యలో కాల్ చేసేవాడు వీరు...
" దివ్య... Are u safe...ఎవరన్నా అనుమానం ఉన్నట్టు కనిపించారా అని అడిగేడు..."
" నా సంగతి నేను చూసుకోగలను... Dont disturb me"
అమ్మాయి మనసు ఒక్కసారి విరిగిపోయాక అతికించడం చాలా కష్టం... కానీ దివ్య తనని ప్రేమిస్తోంది.... ఎంత అలిగినా ఏదో ఒక సమయంలో తిరిగి తనతో మాట్లాడాలి కదా... ఎందుకు నన్ను ఇంతగా ద్వేషిస్తోంది... పైగా వాట్సాఅప్ స్టేటస్ లలో అన్నీ ఏడుపు సాంగ్ లు పెడుతోంది....
" వీరు ఇంట్లో వంద ప్రోబ్లేమ్స్ ఉన్నాయి.... నీ ప్రోబ్లేమ్స్ వినే ఓపిక నాకు లేదు"
" వీరు ప్లీజ్ నన్ను ఇరిటేట్ చెయ్యకు"
అంటూ చాలా కాలం మాట్లాడటం అవాయిడ్ చేసింది... దాంతో వీరు కి ఫ్రాస్టేషన్ పెరిగిపోయింది... మొత్తం సమయం వర్క్ మీద పడిపోయాడు.. ఎప్పుడు, ఎక్కడ తింటున్నాడో, పడుకుంటున్నాడో అతనికే