మొండి 62 హ్యాకర్స్
telugu stories kathalu novels మొండి 62 హ్యాకర్స్ ఆఫీసర్ సత్యం ఇక చేసేది ఏమి లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు...
జైళ్లలో ఉండే టైం టేబుల్ ప్రకారం వాళ్ళతో చేయించే is పనులన్నీ వీరుతో చెయ్యిస్తున్నారు... మామూలు నేరాలు చేసిన ఖైదీలకు ఒక చోట... కాస్త పెద్ద నేరాలకు పాల్పడిన ఖైదీలకు ఒక చోటు.. అలాగే భయంకరమైన నేరస్తులను సెపరేట్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు...
వీరు ఇప్పుడు భయంకరమైన నేరస్తుడు... అతనితో పాటు ఇద్దరు తీవ్రవాదులు... ఒక మావోయిస్టు లీడర్... ఒక పెద్ద సీరియల్ కిల్లర్ ని మాత్రమే ఉంచారు... చంచల్ గూడా జైల్లో ఒకప్పుడు సెల్ ఫోన్లు ఈజీగా దొరికేవి... డబ్బులుంటే సెల్ ఫోన్లు ఈజీగా తెప్పించుకునే వాళ్ళు.. తీవ్రవాదులకు తప్ప ఈ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండేవి... వెంకటేశ్వర్లు అన్న ఆఫీసర్ వచ్చాక అవన్నీ పోయాయి... ఇప్పుడు వీరు కి వేరే కాంటాక్ట్ బయట ప్రపంచంతో దాదాపుగా పోయింది...
లోలోపల కుమిలిపోతూనే... బయటపడటానికి దారులు వెతుక్కుంటున్నాడు... అతనికి ఎదురుగా ముగ్గరు ఖైదీలు మాట్లాడుకుంటూ ఉండటం గమనించాడు... వాళ్ళ మాటల మధ్యలో వీరు గురించి ప్రస్తావన రావడం గమనించాడు వీరు... మరో రెండు రోజులు గడిచిపోయాయి....నెమ్మదిగా అవతల వైపు ఉన్న ఖైదీలు నమస్తే చెప్తూ ఉండటం చూసాడు.. తిరిగి వాళ్లకు సలాం చేసాడు వీరు... ఒక్క భోజన శాలలో తప్పితే కలవడానికి మాట్లాడటానికి వేరే అవకాశం లేదు...
పట్టుబడటానికి సరిగ్గా నెల ముందు కాలిలోకి దూసుకు వెళ్లిన బులెట్ గాయం ఇంకా వీరుని ఇబ్బంది పెడుతోంది... ఇంతక ముందు ఉన్న చురుకుదనం అతని నడకలో కనిపించడం లేదు... వీరు చాలా నెమ్మదించిన మనిషిగా మారిపోయాడు... ఒకప్పటి ఆవేశం అతనిలో లేదు... కానీ ఆలోచనలో పరిణితి వచ్చింది... టాక్టికల్ గా ప్రతీదీ డీల్ చెయ్యడం వచ్చేసింది వీరు కి..
మధ్యాహ్నం భోజన శాలలో నెమ్మదిగా ఇద్దరు ముగ్గురు జేబు దొంగలని సెలక్ట్ చేసుకున్నాడు వీరు... వాళ్ళు కూడా నమస్తే అన్నా అంటూ వీరు వైపు ప్రేమగా పలకరిస్తున్నారు... వీళ్ళతో కొన్నాళ్ళు సాగిస్తే ఏదైనా స్కెచ్ వేయడానికి అవకాశం ఉంటుందని భావించాడు వీరు... అలాగే వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ కాలం