మొండి 60 ఇంకా ఏదో
telugu stories kathalu novels మొండి 60 ఇంకా ఏదో వీరు ని కంట్రోల్ చేసి, బండి ఎక్కించుకుని వెళ్ళిపోయాడు రాజేష్... లహాజా... ఇప్పుడు ఇండియన్ ప్రభుత్వానికి దొరికిన అతి పెద్ద ఆణిముత్యం.... కొన్ని వందల దాడులకు సంబందించిన పూర్తి సమాచారాన్ని భారత దేశానికి ఇచ్చి కాపాడగల గొప్ప సాధనం...
అప్పటి వరకూ వీరు మీద ఉన్న కోపాన్ని ఒక్క దెబ్బతో అతని బాస్, మరిచిపోయాడు.. వీరు ఇప్పుడు మళ్లీ హీరోనే... ప్రస్తుతం అతనిప్పుడు లహాజా తో పాటు ఒక పోలీసు వాహనం లో పయనిస్తున్నాడు....
పక్క పక్కనే కూర్చున్న వీరు, రాజేష్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు... మొన్న రాత్రి వాళ్ళ స్థావరం అయిన అండర్ గ్రౌండ్ రైల్వే లో కలుసుకున్నారు ముగ్గురూ... పక్కా పథకం వేసి, నవాజ్ కు అనుమానం వచ్చేలా చేసి ��వెనకాల ఫాలో అవుతున్న నవాజ్ అసిస్టెంట్స్ ని దారి చూపించారు.. నవాజ్ తొందరపడ్డాడు.. అక్కడే వీరు ని ఖట్స్మ్ చెయ్యడానికి వచ్చాడు.. tactical గా సేఫ్టీ ఉన్న ప్రదేశాన్ని వదిలి.. వల్ల కలుగలోకి ఎలకలా వచ్చేశాడు రైల్వే స్టేషన్ కి... మిగతా ఇద్దరు బాడీ గార్డులను చంపేసి... అతన్ని చాలా సేపు పాటు చిత్రావధలు పెట్టాక మెల్లగా ప్లాన్ డీటెయిల్స్ తీసుకున్నారు... వీరు కోపం తట్టుకోలేక, అతని కాళ్ళు, చేతులు దారుణంగా విరగ్గొట్టేసాడు... ఫ్లాక్కా బాగా తాగించి.. రైల్వే స్టేషన్ లో పడేసి మాస్క్ వేసుకుని వచ్చేశాడు...అది జరిగిన కథ
ఎదురుగా ఉన్న లహాజా కొరకొర చూపులతో వీరు ని చూస్తున్నాడు...
" తప్పు చేస్తున్నావ్..."
" ఎందుకో"
" మీ దేశానికి సాయం చెయ్యడానికొచ్చాను..."
" ల... కో.... ఇంకోసారి మా దేశానికి సాయం... అభ్యుదయం లాంటి మాటలు మాట్లాడితే