మొండి 6 మొదటి ప్రశ్న
telugu stories kathalu novels మొండి 6 మొదటి ప్రశ్న బైక్ లో పోతున్న వీరు, రవి సార్ ఇద్దరూ అప్పుడే పెగ్గేసిన సూర్యోడిలా ఫుల్ కిక్ లో వెలిగిపోతున్నారు.
ఏదో చేసానని ఫీలింగ్. మరోపక్క తన లైఫ్ లో ఏం చేయాలన్న దానిపైన ఒక క్లారిటీ రెండూ వచ్చి అదో రకమైన ఆనందంలో ఉన్నాడు.
లకడికపుల్ నుండి కూకట్ పల్లి వచ్చేటప్పటికి , బండి ఆపమని
" ఇక్కడి నుండి రూం కి బస్ ఎక్కి వెళ్లిపోతా" అన్నాడు వీరు.
రవి సార్ సరే అని చెప్పి.
" ఎక్సయిట్మెంట్ లో ఎవ్వరికీ ఏమీ చెప్పకు. ఈ రోజు నుండి నీ లైఫ్ టర్న్ అయ్యింది వీరు " అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
బస్ లో బయలుదేరి రూమ్ కి చేరుకునేసరికి రాత్రి 10 ఐయింది.రూం లో ఉంటున్న కృష్ణ ప్రసాద్, శివ ఇద్దరూ కలిసి ఏమైందని అడిగితే "సైన్స్ ఫెయిర్ కి స్పాన్సర్స్ కోసం వెళ్ళా" అనిచెప్పాడు. మెల్లగా మిగతా ఇద్దరూ పడకేశారు.పడుకున్నాడంటే పడుకున్నాడనే కానీ వీరుకి ఇంకా నిద్ర పట్టడం లేదు. బుర్ర తోచడం లేదు. లేచి లాప్ టాప్ తీసుకుని కాసేపు క్రిప్టోగ్రఫీ మీద అల్గోరితమ్స్ అన్నీ చూసాడు . ఎప్పుడు నిద్రపోయాడో కానీ, పొద్దున్న లేచి చూస్తే లాప్టాప్ పొట్ట పక్కన పడి ఉంది.
రెడీ అయ్యి కాలేజీకి వెళ్లిన వీరు, రవి సార్ తో మాట్లాడాలని పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆయన క్లాస్ ఇప్పుడా అని టైం చూసుకుంటూ మిగతా క్లాసులు వింటున్నాడు. ఫ్రంట్ బెంచ్ లో దివ్య కి ఇవన్నీ చెప్పాలి, ఏదో చేశానని చెప్పాలి. ఇంకెవ్వరితో కాకపోయినా తనకు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇలా అనుకోవడమే కానీ మళ్ళీ సార్ మాటలు గుర్తొచ్చి సైలెంట్ గా ఉన్నాడు.సాయంత్రం 3 ఇంటికి క్లాస్ కి వచ్చాడు రవి సార్ . ఆయన క్లాస్ అయినపోయిన నెక్స్ట్ నిమిషం ఆయన దగ్గరకు వెళ్ళాడు వీరు. బయట దాకా కబుర్లు సాదా గా చెప్పుకుంటూ తీసుకెళ్లి బైక్ ఎక్కమన్నాడు రవి.
ఇద్దరూ కలిసి పంజాగుట్ట దాకా వెళ్లారు. మళ్ళీ ఎవరినైనా పరిచయం చేస్తాడేమో అని ఆశించాడు. అక్కడే ఉన్న సందులోని ఒక ఆఫీసు లోకి తీసుకెళ్లాడు.ఆఫీస్ డబుల్ బెడ్ రూమ్