మొండి 56 వింత మనుషులు
telugu stories kathalu novels మొండి 56 వింత మనుషులు దివ్య తో పాటు సంతోషంగా వెళ్తున్న వీరు, ఆ శబ్దంతో అలెర్ట్ అయిపోయాడు... అది ఒక పిస్టల్ నుండి వచ్చిన శబ్దం..ఆ శబ్దం వచ్చిన దిశగా దివ్య భయం భయంగా చూసింది.... నిజానికి ఆ తూటా వారికి వెనుకాల ఉన్న పొడల్లోకి దూసుకుపోయింది. రెండు సెకండ్ల ముందు అక్కడ ఉంది ఉంటే, ఆ తూటా వారిలో ఒకళ్ళ లోకి దిగబడిపోయేది.....
నిజంగా ఆ తూటా ఎవరు కాల్చారు.... చూసాడు వీరు... అక్కడున్న అందరి ముఖాలు చూసిన క్షణంలో గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు.... వెంటనే మరొక ఆలోచన చెయ్యకుండా తమ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు వీరు... వీరు ఆ రూమ్ దగ్గరికి వెళ్లగానే ఆ రూమ్ మొత్తం చిందర వందరగా పడేసి ఉంది... నిజానికి వీరు అక్కడికి వచ్చిన పని వేరు... దివ్య ప్రస్తుతం తన ఇంట్లో ఉండటం కన్నా... తన దగ్గర ఉంటే నే సేఫ్...
ఇకపోతే ఇంతకు ముందు ఓపెన్ చేసిన ఫైల్స్ అన్నింటిలో దొరికిన సరికొత్త వివరం ఏంటంటే కేరళ నుండి వాళ్లకు మధ్యలో ట్రాన్సక్షన్ లు జరిగాయి.. దేశం లో అత్యున్నత మైన జీవన స్థాయి అందుకున్న కేరళ రాష్ట్రం నుండి ఇవి ఎందుకు జరుగుతున్నాయి .. అన్నది కనుక్కోవడానికే వీరు అక్కడికి వచ్చాడు... పనిలో పనిగా దివ్యతో కాసేపు గడపొచ్చని... వెంటనే అక్కడి నుండి బ్యాగులు మిగతా సామాను సర్దుకుని రిసెప్షన్ దగ్గరకి చేరుకున్నాడు... లక్కీగా వాళ్ళు నిద్రపోతున్నారు...
అక్కడికి వచ్చిన వాళ్ళ డేటా తీసుకుని, అలాగే తన డేటా ఎరేజ్ చెయ్యడం ప్రస్తుతం వీరు ముందు ఉన్న పని... రిజిస్టర్ తీసుకుని అక్కడ నుండి బయలుదేరాడు... పైగా అక్కడున్న హోటల్స్