మొండి 55 ప్రణయమ్
telugu stories kathalu novels మొండి 55 ప్రణయమ్ ఇక దివ్య రాదని అర్ధం అయిపోయింది వీరు కి...
తన దగ్గరున్న డబ్బులతో ఏమి చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు..
వెబ్ సైట్స్ ఓపెన్ చేసి టూర్ కి ఒంటరిగా ప్లాన్ చేస్తున్నాడు
అప్పుడే దివ్య నుండి ఫోన్ వచ్చింది.... వీరు కి
" వీరు...."
వీరు గుండె డదడడా కొట్టుకుంది....
" ఎప్పుడు వెళదాం"
" అబ్బా.... "అని మనసులో అనుకున్నాడు వీరు...
" నీ ఇష్టం చెప్పు... "
" అయితే ఈ సండే నుండి ప్లాన్ చేద్దాం.."
ఆ మాటకి వీరు అన్నీ మరిచిపోయాడు.... దివ్యతో బయటకు వెళ్లడం... అదీ పెళ్లి కాకుండా... తనతో కలిసి.... వావ్ అనుకున్నాడు...
" నిజంగానే చాలా నెలల తరువాత డ్యూటీ కోసం కాదు... తనకోసం తాను టైం స్పెండ్ చేయబోతున్నాడు... "నేను మనిషినేగా" అనుకున్నాడు లోలోపల....
" మరి మమ్మీ తన్నలేదా నిన్ను... "
" లేదు..! ఏదో చెప్పి ఒప్పించాలే... " అని అనింది దివ్య...
వీరు అనుకున్న రోజు రానే వచ్చింది.... దివ్య తో కలిసి వెళ్ళడానికి రెడి అయ్యాడు వీరు.... లాప్ టాప్.. అలాగే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి రోజూ నోట్స్ రాసుకుంటూనే ఉన్నాడు... వెళ్లే రోజున కూడా..
" హైదరాబాద్ టు కోయంబత్తూరు కనెక్టింగ్ ఫ్లయిట్ ఒకటి ఇద్దరికీ కలిపి ప్లాన్ చేశాడు"
దివ్య ఎయిర్ పోర్ట్ కి వచ్చేసింది... విమానంలో దివ్య పక్కన కూర్చున్నాడు వీరు...
"నేను విండో సీట్ దగ్గర కూర్చుంటా" అని అడిగి కూర్చుంది.. విమానం టేక్ ఆఫ్ దగ్గర నుండి...కోయంబత్తూరు ఎయిర్ పోర్ట్ లో దిగే దాకా అలానే మబ్బుల్ని, నేలని చూస్తూ ఉండిపోయింది.. పసి పిల్లలా