మొండి 53 స్టేషన్
telugu stories kathalu novels మొండి 53 స్టేషన్ అప్పటికి వీరు కి అకౌంట్ లో 25 లక్షల రూపాయలు డబ్బులు పడ్డాయి... రూమ్ ఖాళీ చేసి బయట ఇంకొక హోటల్ లో బస చేరాడు.
అతని మనసులో ఆలోచనలు అతన్ని కాల్చేస్తున్నాయి. వీరు కి నిజంగానే ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. దుప్పట్లో దూరి పడుకుందామా అంటే, అది కూడా కుదరడం లేదు. రేపు ఆఫీసులో ఏమి చెప్పాలి. అతను చేసిన తలతిక్కపనికి ఏమని సమాధానం ఇచ్చుకోవాలి అక్కడున్న వారందరికీ.. !అనుకుంటూ కూర్చున్నాడు.
కాసేపు అయినా మేల్కొని, ఏదైనా చేద్దాం అని ఫిక్స్ అయ్యాడు. అప్పుడే వారందరి నుండి తెచ్చుకున్న ఫోన్స్ అన్నీ తీసాడు. ఒక్కో ఫోన్ ఓపెన్ చేసి మెసేజీలు, వాట్సాప్ కాల్స్ చూస్తున్నాడు. అనుమానం ఉన్న డీటెయిల్స్ అన్నీ ఒక నోట్ బుక్ లో రాసుకుంటున్నాడు. విక్రమ్ మొబైల్ వంతు వచ్చింది. గ్యాలరీ లో అతని భార్యతో దిగిన ఫోటోలు , పిల్లల బర్త్ డేలో కేకులు తింటున్న ఫోటోస్ అన్నీ చూస్తున్నాడు .వీరు కి అప్రయత్నంగా చేతులు తల మీదకు పోయాయి. ఒక పక్కన బాధ, మరొక పక్కన వంచన , మరో దివ్య గుర్తొచ్చింది. తనకు కూడా ఇలా అయితే దివ్య పరిస్థితి ఏంటి. దివ్య కి ఏమైనా అయితే - ఒక వేళ.. అప్పుడెలా??? అనుకున్నాడు.
ఇక వీలు కాదని పడుకోబోతున్న సమయంలో ఫోన్ మోగింది, ఇందాక చంపిన వారిలో నల్లటి వ్యక్తి నుండి తీసుకున్న ఫోన్... వీరు ఎత్తుదామని ఆగాడు. ఫోన్ మోగి మోగి ఆగిపోయింది. అప్పుడు మోగింది విక్రమ్ ఫోన్, BOTIM యాప్ నుండి కాల్. వీరు కాసేపు ఆలోచించి లాస్ట్ రింగ్ కి ఎత్తాడు.
అవతలి నుండి pasthoo భాషలో మాటలు. వీరు కాశ్మీర్ నుండి వెళ్ళేటప్పుడు కాస్త బేసిక్స్