మొండి 51 చావు దెబ్బ
telugu stories kathalu novels మొండి 51 చావు దెబ్బ అక్కడికి చేరుకుంటున్న సమయంలో తన ట్రైనింగ్ మొత్తాన్ని ఒక సారి గుర్తు చేసుకున్నాడు వీరు. SPG COMMANDO లకు కచ్చే ట్రైనింగ్ ఇస్తారు ఏజెంట్స్ కి. దాదాపు 96 గంటల పాటు నిద్ర కూడా లేకుండా, వాళ్లకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో బాడీ కి సంబంధించిన స్లీప్, ఫుడ్ సైకిల్స్ మొత్తం నాశనం చేస్తారు అక్కడి సిబ్బంది. ఒక్కొక్క ట్రైనీ కి దాదాపు ఆరుగురు ఇంచార్జ్ లు షిఫ్ట్ వైస్ పని చేస్తారు. పొద్దున్న ఆరు గంటలకు టిఫిన్ కడుపు నిండా పెడతారు. వెంటనే 1 కిలో మీటర్లు పల్టీ లు కొడుతూ వెళ్ళాలి. వీరుకి అప్పటికే వాంతులు అయ్యాయి. అయినా సరే, వెంటనే 30 కిలో మీటర్లు పరిగెత్తిస్తారు, ఆ తరువాత రియల్ బాక్సింగ్, నెత్తి మీద నుండి బుల్లెట్స్ ని ఫైర్ చేసి అలవాటు చెయ్యడం, మధ్య మధ్యలో, నిమ్మకాయ రసం ఇవ్వడం ఇలా చేస్తారు. ఇలాంటి ట్రైనింగ్ లో 96 గంటలూ నిద్రలేకుండా ప్రయాణించినవాడు వీరు ఇంకో ముగ్గురే. తన ట్రైనింగ్ ని పూర్తి స్థాయిలో బయటపెట్టాల్సిన టైం వచ్చిందని అర్ధం అయ్యింది వీరు కి.
మియాపూర్ లో ధర్మపురి వెనుకాల ఉన్న గుట్టల మధ్యలో ఉన్న ఒక చిన్న వాచ్ మెన్ రూమ్ కి తీసుకెళ్లారు వీరు ని. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. తలుపు తెరిచి చూస్తే
ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి వీరు, NIA లో చూస్తున్న మిగతా స్టాఫ్ కూడా ఆదిరిపోయారు. వీరు కి మొత్తనోదట హ్యాకింగ్ నేర్పించిన విక్రమ్. వీరు తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. కోపం, ఉక్రోషం రెండూ ఒకే సారి వచ్చి పడ్డాయి. ఇంకా ఏమి జరుగుతుందో చూద్దామని ఎదురు చూస్తున్నాడు వీరు. ఎవ్వరినీ నమ్మొద్దు అని చెప్పిన రాజేష్