మొండి 5 పజిల్
telugu stories kathalu novels మొండి 5 పజిల్ రవి సార్ పిలిచారని వినగానే దివ్య తో మళ్ళీ మాట్లాడతానని చెప్పి క్యాంటిన్ నుండి పరుగు తీసాడు వీరు.
" ఏంటోరా బాబు. ఆ పిల్ల నాతొ మాట్లాడాలి అనుకున్నప్పుడే అందరూ నా మీద పడతారు " అని మనసులో తనని తాను తిట్టుకుంటూ స్టాఫ్ రూమ్ లో కి వెళ్ళాడు. స్టాఫ్ రూమ్ లో రవి ఒకడే ఒంటరిగా కూర్చుని కంప్యూటర్ మీద ఎదో టైపు చేస్తూ ఉన్నాడు.
వీరు సైలెంట్ గా రవి సార్ ఏదైనా చెప్తారేమో అని పక్కన కూర్చుని ఉన్నాడు. కాసేపు పాటు రూమ్ మొత్తం మౌనమే ఉంది. రవి ఎదో టైపు చేస్తూ ఉన్నాడు. వీరు కి ఏం అర్ధంకాక , "సార్" అని మాట్లాడేలోపల రవి మొదలుపెట్టాడు.
" వీరు. లాస్ట్ మంత్ ప్రాక్టికల్ క్లాస్ లో ఏదో ప్రోగ్రాం రాసా అన్నావ్ "
" అవును సార్. "
" నాకు గుర్తు రావడం లేదు. దేని గురించి అన్నావ్, అది "
" సార్! అది పాపులర్ పజిల్ 3301 ఉంది కదా. దాన్ని ఎలా సాల్వ్ చెయ్యొచ్చో, దాని గురించి రాసా "
కాసపు వీరు రాసిన ఆ అల్గోరిథం కోడ్ ని సిస్టన్ లోకల్ ఫైల్స్ లో చూసి నిట్టూర్చాడు.
" సరే! నాతొ రా. " అని వీరు ని కాలేజీ నుండి బైక్ లో తీసుకెళ్లాడు.
ఎక్కడికెళ్తున్నారో వీరు కి అర్ధం కావడం లేదు. ఊరికినే కాసేపు బళ్ళు, రోడ్ల మీద ఉన్న బస్సు లు అన్ని చూస్తూ బైక్ వెనుక సీట్ లో కూర్చున్నాడు. ఏదో సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ పని మీదనే తీసుకెళ్తున్నాడని మాత్రం ఫిక్స్ అయ్యాడు మనస్సులో.
వెళ్తున్న బండి కాస్త పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఆపాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి. ఎదురుగా పోలీస్ జీపులో ఉన్న ఒక ఆఫీసర్‌కి నమస్తే చెప్పాడు. బండి ఫాలో అవ్వమని, చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీసర్. రవి అలానే ఫాలో అవుతూ, ఖైరతాబాద్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
వీరు కి మనస్సులో పోలీసుని చూడంగానే ఏదో అనుమానం మొదలయ్యింది. మొన్నసార్ తనకు చెప్పిన మాటకి ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్తున్న, సందర్భానికి ఉన్న లింక్ ఏంటా అని ఆలోచిస్తున్నాడు.
చివరికి లక్డికాపూల్ లో రాజ్ దూత్ హోటల్ కి దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ కి పట్టుకెళ్ళాడు. బయట మొత్తం 1970లలో కట్టిన బంగాళా లా ఉంది అది. బయట మొత్తం పాడుపడిన , ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇక, కాసేపట్లో ఎలాగూ తెలుస్తుంది కదా అని వీరు ప్రశ్నలు అడగకుండా అలానే నిశబ్దంగా ఫాలో అవుతూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి మూడవ అంతస్థు