మొండి 48 వేట
telugu stories kathalu novels మొండి 48 వేట హోటల్ రూమ్ లో కూర్చుని ఆలోచిస్తున్న వీరు , లాప్ టాప్ ని తెరిచాడు. తెరవగానే ఎదురు కెమెరా దగ్గర గ్రీన్ లైట్ వెలిగింది. ఒక్క క్షణం అదిరిపడ్డాడు వీరు. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. మాల్ వేర్ , లేదా యాడ్ వేర్ లను ఏదైనా కంప్యూటర్ లోకి పంపిస్తే , ఎవరైనా వాటిని ఓపెన్ చేస్తే, అక్కడ నుండి సిస్టం నుండి ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా హ్యాక్ చెయ్యొచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రవి సార్ సిస్టమ్ ఇప్పుడు హ్యాక్ అయ్యింది అన్నమాట. అందుకే వెబ్ కామ్ దానంతట అదే ఓపెన్ అయ్యింది.
ఇప్పుడు కొత్త డౌట్ ఏంటి ? లాప్ టాప్ తెరవగానే కెమెరా నుండి తన ఫేస్ ని ఎవ్వరో చూసి ఉండాలి , లేదా కెమెరా లోడ్ అయ్యేలోపల తాను పక్కకు జరిగాడు కాబట్టి తప్పించుకుని అన్నా ఉండాలి.
ఏదైతే అది అయ్యింది. ముందు వీరితో ఈ గేమ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయ్యింది? ఎప్పుడు మొదలయ్యింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు వీరు. దాదాపు 2 సంవత్సరాల నుండి జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు తీయడం మొదలుపెట్టాడు.
రవి సార్ హత్య -
డ్యామ్ బ్లాస్ట్ -
అప్పుడు టీం వ్యూయర్ లో చూసిన అమీర్ పెట్ మాఫియా -
పెట్రోల్ బంకు
-ఇప్పుడు దివ్య పైన దాడి
"వీటన్నింటికి ఏ లింక్ తో మొదలుపెడితే కేసు ముందుకు వెళ్తుంది" అని ఆలోచించడం మొదలుపెట్టాడు వీరు. ఆఫీసర్ గా మారిపోయిన వీరు తిరిగి వేట మొదలుపెట్టాడు. తనలోనే తాను మాట్లాడుకుంటూ , అన్నీ రీకాల్ చేస్తున్నాడు.
కాసేపటికి బ్లింక్ అయ్యింది " ఎస్ . నేనెవరో వాళ్లకు ఎక్కడో స్లిప్ ఇచ్చాను. నా గురించి తెలిసే ఉండి తీరాలి. లేకపోతే, ఆ రోజు నన్ను ఆ అజ్ఞాత వ్యక్తి మంటల్లో ఉన్నప్పుడు గమనిస్తూ ఉండి ఉండడు. నేను అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికే అక్కడికి వచ్చాడు "
ఇంత దూరం వచ్చాక యుద్ధం ఆపడం దేనికి. పట్టుకుందాం. అమీర్పేట్ మాఫియా రవి లాప్ టాప్ లో చూసిన మొదటి విషయం కాబట్టి , మొదటి లింక్ వాళ్ళ దగ్గర నుండి లాగితే బాగుంటుంది. వీళ్ళ పని పట్టాలంటే , లింక్ దొరకాలంటే , ఒకటే దారి , రివర్స్ గేమ్ ఆడాలి. అంటే వాళ్లు తన వెంట పడేలా