మొండి 47 ఒక నిజం
telugu stories kathalu novels మొండి 47 ఒక నిజం" నిజం చెప్పు వీరు "
" ఏది దివ్య ?"
" నువ్వు ఎయిర్ పోర్ట్ లో జాబ్ చేస్తున్నావా లేదా ?"
వీరు కి ఒక సెకండ్ బ్రెయిన్ పని చెయ్యడం మానేసింది. దివ్యకి అసలు నిజం ఇప్పుడన్నా చెప్పేద్దామా? లేకపోతే ఆఫీస్ లో అడిగి అయినా చెప్పాలా ? ఎలా ఇప్పుడు ఎలా మేనేజ్ చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నాడు వీరు.
" ఎందుకు అంత ఆలోచిస్తున్నావు ? నాకు అబద్ధం చెప్తున్నావా మళ్ళీ "
" లేదు దివ్యా "
" వీరు నాకు చాలా తల నొప్పిగా ఉంది. నీకోసం ఓపిక తెచ్చుకుని మాట్లాడుతున్నాను . ప్లీజ్ "
" నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో చెప్పు "
" అంతే కానీ నాకు నిజం చెప్పను అంటావ్ "
" కాదు దివ్య కాస్త పొద్దున్న మళ్ళీ ఇంటికి వచ్చి కలుస్తా. అప్పుడు చెప్తా "
" ఇప్పుడు ఎందుకు చెప్పవు అంటున్నా. అదే నాకు నచ్చదు. కరెక్ట్ టైం కి మాయం అయిపోతావ్ "
" దివ్య నన్ను నమ్ము . రేపు పొద్దున్న వచ్చి నీకు అసలు జరిగింది అంతా చెప్తాను. అలా చెప్పక పొతే నన్ను క్షమించకు "
వీరు చేసిన మొదటి తప్పు అదే. కానీ , పొరపాటున ఫోన్ టాప్ అయ్యిందంటే , అదే అతి పెద్ద బ్లండర్ అవుతుంది. అమ్మాయిలకు అనుమానం వచ్చినప్పుడే నిజాలు అన్నా చెప్పాలి, అప్పటికప్పుడు క్లారిటీ అన్నా ఇవ్వాలి. వాళ్ళని కన్ఫ్యూషన్ లో పెట్టి వదలకూడదు. మొత్తానికి ఏదోలా మేనేజ్ చేసి