మొండి 46 ప్రేమ
telugu stories kathalu novels మొండి 46 ప్రేమ వీరు కి ఎందుకో గుండె దడ దడ కొట్టుకుంది. ఎప్పుడు ఐ లవ్ యూ చెపుదామని వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల దివ్య పైన లవర్ పుకారు ఒకటి గుర్తొచ్చింది. పొసెసివ్ ఫీలింగ్ ఒకటి ఏడిచింది కదా. ఎలాగైనా అడిగేద్దాం అని ఫిక్స్ అయ్యాడు.
" అవును ? నీకు బాయ్ ఫ్రెండ్ దొరికేసాడా అయితే ?"
అవతల వైపు నుండి ఒక్క సెకండ్ సైలెన్స్. ఏమి ఆన్సర్ చెప్తుందో అని వీరు కి సెగలు పుడుతున్నాయి.
" నేనెప్పుడు చెప్పా. నాకసలు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ. నీకా డౌట్ ఎందుకు వచ్చింది "
" జస్ట్ అలా అనిపించింది. అంతే "
" ఆహా ఇంకా ఎలా ఎలా అనిపిస్తోంది వీరు "
దివ్య తో ఎందుకు కాస్త చనువు పెరిగింది అనిపించింది వీరు కి.
" అది కాదు రా ... ఇంత బాగుంటావ్ కదా ! ఎవరైనా ఈపాటికి నచ్చి ఉంటారేమో "
" ఉండుండొచ్చు. చెప్పలేం " అని ఉడికించింది దివ్య.
ఒక్క క్షణం వీరు టెన్షన్ పడ్డాడు.
" హే నిజం చెప్పు ! బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా " బయటకి క్యాషువల్ గా అంటున్నాడే కానీ , లోలోపల దివ్య ఏమి చెప్తుందని వణికిపోతున్నాడు.
" నీ మొహం ! ఉండుంటే నాకు ఆక్సిడెంట్ అయితే ఇంటికి నువ్వే ఎందుకు వచ్చేవాడివి. వాడిని పిలిచే దాన్ని కదా"
వీరు ఆగిపోయాడు. బల్బ్ ఎదో వెలిగింది.
"ఏమన్నవ్ ?" ప్రపంచం లో పెద్ద పెద్ద కోడ్స్ ని క్రాక్ చేసే వీరు కి , దివ్య చెప్పిన మాట పెద్ద పజిల్ లా విన్పించింది.
"ఉండుంటే నాకు ఆక్సిడెంట్ అయితే ఇంటికి నువ్వే ఎందుకు