మొండి 45 తిరుగుదాడి
telugu stories kathalu novels మొండి 45 తిరుగుదాడి ఆమె ఏమి మాట్లాడకుండా వీరు ని దివ్య రూమ్ కి పట్టుకెళ్లింది. అక్కడ మంచం మీద పడుకుని ఉంది దివ్య. కాలు కి పెద్ద కట్టుకట్టి ఉంది. దివ్య ఎడమ చెయ్యి బాగా గాయపడి తోలు లేచిపోయి ఉంది. ఒక్క సారిగా దివ్య ని అలా చూసేటప్పటికి అప్పటిదాకా ఉన్న ఉత్సాహం పోయి ,తెలియని ఆవేశం , బాధ వచ్చి పడ్డాయి.
దివ్య తో మాట్లాడేలోపల వాళ్ళ అమ్మ మాట్లాడటం మొదలుపెట్టింది.
" బైక్ లో వెళ్ళాడు వెళ్ళద్దు అని చెప్తున్నా వినలేదు. స్కూటీ ని గుద్దేసి వెళ్లిపోయారు బాబు. ఇంకా నయం హెల్మెట్ పెట్టుకుంది కాబట్టి బ్రతికి పోయింది. " అని తిట్ల పురాణం అందుకుంది దివ్య వాళ్ళ అమ్మ. కాసేపు అరిచాక దివ్య దగ్గర కూర్చున్నాడు వీరు. వాళ్ళ అమ్మ కాఫీ పెట్టడానికి వెళ్ళిపోయింది.
వీరు ని చూసి దివ్య అమాయకంగా ఒక నవ్వు నవ్వింది. వీరు ని దగ్గర కూర్చోమని చెప్పింది. దివ్య ని అలా చూడటం చాలా పెయిన్ ఫుల్ గా ఉంది వీరు కి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మొదటి సారి లవర్ ని అలా చూస్తే ఎవ్వరికైనా అలానే ఉంటుంది. దివ్య ఎదురుగా కూర్చున్నాడు.
ఎడమ చెవి దగ్గర ఎర్రగా వాచిపోయి ఉంది. వీరు కూర్చోగానే దివ్య, వీరు చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఒక్క క్షణం షాక్ అయినట్టు అనిపించింది వీరు కి. వీరు కూడా ఎందుకో తెలియకుండానే దివ్య చెయ్యిని కాసేపు అలా పట్టుకుని ఉండిపోయాడు. ఇద్దరూ ఏమి మాట్లాడటం లేదు.
వీరు కి ఏమి మాట్లాడాలో తెలియక " అసలు ఏమి జరిగింది ?" అన్నాడు.
దివ్య " ఎవడో ......%#$% గాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. దాదాపు గంట సేపు వెంటపడ్డారు ". దివ్య బూతులు తిట్టడం మొదటి సారి చూసాడు వీరు. "ఏ??? అబ్బాయిలకు బూతులు వస్తాయా. అంత పెయిన్ లో ఇష్టమైన వాళ్ళ దగ్గర కూడా ఫ్రీ గా మాట్లాడరా ఏంటి, అమ్మాయిలు?" అని అనుకున్నాడు.
పొద్దున్న రాత్రి ఉద్యోగంలో పడేటప్పటికీ వీరు ఎందుకో ఆఫీసర్ లా ఆలోచించడం బాగా అలవాటు చేసుకున్నాడు. దివ్య కి ఎలా ఉంది అని అడగటం మర్చిపోయి