మొండి 44 తిరుగుదాడి
telugu stories kathalu novels మొండి 44 తిరుగుదాడి ప్రశాంతంగా నిద్రపోయిన వీరు కి తెలియదు, అక్కడ ప్రపంచం మొత్తం ఎలా తల్లకిందులు గా ఉందో. దేశంలో వాతావరణం ఎలా ఉందో. పొద్దున్న 10 ఇంటికి తాపీగా లేచిన వీరు కి ఎదురుగా కనిపించాడు అతని కళ్ళ ముందు బాస్. దెబ్బకి ఉలిక్కి పడి లేచాడు వీరు.
" సార్ ! గుడ్ మార్నింగ్ సార్ " అని అంతక మించి ఏమి మాట్లాడాలో తెలియక అలానే నిలబడిపోయాడు వీరు.
ఎదురుగా ఉన్న ఆఫీసరు పెద్దగా నవ్వాడు.
" నువ్వు మేము అందరం గర్వ పడే పని చేసావు వీరు. అజిత్ సార్ నిన్ను పర్సనల్ గా కలిసి ఇది ఇవ్వమన్నారు " అం ఒక కవర్ ఇచ్చారు. తీసుకుని చూస్తే ఒక లెటర్ ఉంది. వీరు ని అభినందిస్తూ ప్రధానమంత్రి ఆఫీసు నుండి అభినందన పత్రం. "దేశం కోసం నువ్వు చేసిన పని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అని ప్రధాన మంత్రి నుండి స్వయంగా రాసిన ఉత్తరం చదవగానే వీరు మొహం వెలిగిపోయింది. అదే కవర్ లో ఒక చెక్ ఇవ్వబడింది. ఏంటా అని తీసి చూసాడు వీరు. 25 లక్షల రూపాయల చెక్. 25 ఏళ్ళు మాత్రమే నిండిన వీరు జీవితంలో ఎప్పుడూ అలాంటి చెక్ ని చూడనేలేదు. కనీసం 30 వేలు జీతం చూసి కూడా చాలా ఎరుగడు. ఎదురుగా ఆఫీసర్ ఉన్నాడని ఆగాడు కానీ , లెగంటే ఎగిరి గంతులు వేసే వాడు. ఆ ఆఫీసరు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూడటం మొదలయ్యింది వీరు మనస్సులో.
అయితే , ఇప్పుడు వీరు మైండ్ లో మరొక్క ఆలోచన కూడా ఉంది. జీవితంలో ఎవ్వరూ చెయ్యని రిస్క్ చేసాడు. అంటే పూర్తిగా రిస్క్ జోన్ లోకి తాను అడుగు పెట్టేసాడు. రాత్రి మెసేజ్ చూసినప్పటి