మొండి 42 పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ
telugu stories kathalu novels మొండి 42 పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ బస్సు ప్రయాణం రాత్రి మొత్తం అయ్యింది. 596 కిలోమీటర్ల దూరం ప్రయాణించే టప్పటికి అంతే సమయం పడుతుంది. పైగా ఆ రూట్ లో రోడ్లు చాలా అధ్వానంగా ఉంటాయి. వీరు కూడా దాదాపుగా నిద్రలేకుండా ఉండటంతో చచ్చేట్టు నిద్రపోయాడు.
పొద్దున్న 5 ఇంటికి మగతగా మత్తు మెలుకువ వచ్చింది నిద్ర లో. అలాగే ,మూసుకుపోతున్న కళ్ళతోనే ఎక్కడున్నామో చూసుకుంటున్నాడు. పక్కన మిగతా వాళ్ళు కూడా టోపీలు తీసి తీవ్రంగా గురకలు పెట్టె కార్యక్రమంలో ఉన్నారు. బస్సులో ఒక్కొక్కళ్ళే నిద్ర లేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్ట్ అది. బస్సు డ్రైవర్ దగ్గర వివరాలు తీసుకుంటున్నారు. లోపల ఒకళ్ళిద్దరిని ఎవ్వరు ? ఎక్కడ నుంచి వచ్చారు అని ప్రశ్నలు అడుగుతున్నారు. విషయం ఏంటంటే , పాకిస్తాన్ ఆర్మీ లో పై వారికి తప్ప కింద స్థాయి వారితో తీవ్రవాదులకు పెద్దగా లింక్ ఉండదు. కొంత మంది బాగా ఎంకరేజ్ చేస్తే , మరి కొంత మంది తీవ్రవాదులని గుర్తించి కాల్చుకు తింటారు. అలా ఉంటారు మరి.
ఒకళ్ళిద్దరిని ప్రశిస్తూ బస్సులోకి వచ్చిన పాకిస్తానీ సైనికుడు , డైరెక్ట్ గా వీరు దగ్గరికి వచ్చాడు. చావు మెల్లగా పాకుతూ మన మీదకు రావడం లైవ్ లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది వీరు కి. తనను కఠినంగా తీర్చిదిద్దిన ట్రైనింగ్ ఆఫీసర్స్ అందరికీ లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నాడు. లేదంటే ఈ పాటికి , గుండె ఆగిపోయేది.
" ఏ. క్యా నామ్ హాయ్ తేరా? కహా సే ఆయా ?"
" గుర్జన్ వాలా ? " అన్నాడు వీరు.
అది అతడి కొంప ముంచింది. మిగతా వాళ్ళందరూ చెప్పిన ఊరుకి , అతను చెప్పిన ఊరికి సంబంధం లేదు.
" బస్సు దిగు ... బస్సు దిగు " అని వీరు ని లాక్కెళ్లిపోయాడు అతను.
అయిపొయింది ఇవాళ్టితో నాకు అనుకున్నాడు వీరు. మరుక్షణం, ఇక్కడ నుండి బయటపడాలంటే దారి ఏది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. 30 మంది తీవ్రవాదులు , 20 మంది సైనికులు , దాదాపు 50-60 కిలోమీటర్ల దూరం వరకు పాకిస్తాన్ , ఎలా తప్పించుకోవాలి అని