మొండి 41 పాకిస్తాన్ లో వీరు – 2
telugu stories kathalu novels మొండి 41 పాకిస్తాన్ లో వీరు - 2 అక్కడ వీధి వీధిలో తిరుగుతూ తనకు అప్పటిదాకా పై అధికారులు ఇచ్చిన సమాచారాన్ని నెమరు వేసుకుంటున్నాడు. ఇందాక పరిచయం అయిన యువకుల దగ్గర నెమ్మదిగా మాట్లాడుతూ వచ్చిన వీరు , ఇప్పుడు కాస్త మాటల జోరు పెంచాడు. దారిన పోయే వాళ్ళని ఒక డాక్టర్ కమ్రాన్ సాబ్ ఇంటికి వెళ్ళాలి అని అడుగుతూ పోతున్నాడు . అతను అలా జోరు పెంచడానికి కారణం , అక్కడి యాస కాస్త పట్టుకోగలగటమే.
కాసేపు తిరిగిన తరువాత డాక్టర్ కమ్రాన్ క్లినిక్ దొరికింది. పూర్తిగా పాడైపోయిన భవంతిలా ఉంది ఆ బంగళా. ఎప్పుడో బ్రిటీషర్ల కాలంలో కట్టిన ఆ భవంతిలో , మెడికల్ సర్వీసులు ప్రజలకు ఇస్తూ ఉంటున్నాడు కమ్రాన్. రిసెప్షనిస్ట్ వద్ద వివరాలు ఇచ్చి లోపలి వెళ్ళాడు వీరు. లోపల కూర్చుని ఉన్నాడు డాక్టర్ కమ్రాన్. లావైన పొట్ట , బట్ట తల , ఎర్రని రంగు వేయించిన జుట్టు , నోట్లో పాన్ నములుతూ స్వచ్ఛమైన పాకిస్తానీ వృద్ధుడు వీరు కళ్ళ ముందు కూర్చుని ఉన్నాడు. వీరు అతని దగ్గరికి రాగానే " హైదరాబాద్ సింధ్ కా నహీ హయ్ " అన్నాడు. అది విన్న కమ్రాన్ మెల్లగా తల ఎత్తి వీరు కళ్ళల్లోకి చూసాడు. కాసేపు అతన్ని తీక్షణంగా గమనించి , లోపలికి తీసుకువెళ్లాడు. అతని పాడుబడిన పాత ఇంటిలో వీరు కి ఒక మాములు నోకియా ఫోన్ , అలాగే కొన్ని , కాగితాలు చూపించాడు.
" ఆ కాగితాల్లో నీకు కావలసిన సమాచారం ఉంది " అని చెప్పేసి వీరు ని పంపించేశాడు. మొత్తానికి అక్కడ నుండి బయట పడిన వీరు ఆ కాగితాల్లో ఏముందని కనుక్కోవడానికి ముందు ఒక దాక్కునే ప్రదేశానికి వెళ్ళాడు. పక్కనే ఉన్న రైల్వే పట్టాలు పక్కన ఒక చెట్టు కింద కూర్చుని చదువుతున్నాడు.
ఆ కాగితంలో ముజాహిదీన్ లకు ట్రైనింగ్ లోకి ఎంపిక అయిన 13 మంది యువకుల