మొండి 40 పాకిస్తాన్ లో వీరు
telugu stories kathalu novels మొండి 40 పాకిస్తాన్ లో వీరు పాకిస్తాన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు , జాగ్రత్తలు చెప్పి రెడీ చేశారు వీరు ని. వీరు కి గుండెల్లో ఎక్కడో కాసింత సంశయం ఉంది , కానీ , అజిత్ సార్ కి అస్సలు ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే , ఎంతటి పరిస్థితుల్లో అయినా అతని శక్తి సామర్ధ్యాలు ఎలా తట్టుకోగలవో దగ్గర నుండి చూసాడు. అందుకే ఈ అసైన్మెంట్ కి వీరు ని ఏజెంట్ గా పంపిస్తున్నాడు పాకిస్తాన్ కి.
పాకిస్తాన్ వెళ్ళడానికి ముందు వీరు చేతిలో ఒక ఫోన్ ఇవ్వబడింది. అది ఏ షాపులో కొన్నారు దగ్గరనుండి, వీరు కొత్త పేరు, అతని ఊరు, అతని కుటుంబం ఇలా అన్నింటి గురించి వివరాలు కొత్తగా తయారు చేసి ఇవ్వబడ్డాయి. ఆంజనేయ స్వామి ని లంకకు పంపినట్టు , వీరు ని పాక్ కి పంపిస్తున్నారు వాళ్ళు. సరికొత్త మారు వేషం తో . వీరు నార్త్ ఇండియన్ లుక్ , లేత తనం అతనికి అతి పెద్ద ప్లస్.
ఇండియా దాటి వెళ్ళాక వీరు ఇక ఉర్దూ లోనే మాట్లాడాలి. హైదరాబాద్ గల్లీ లో తిరిగిన పుణ్యమా అని అది తేలికగానే నేర్చుకున్నాడు. దివ్య తో మాత్రం ఒక సారి మాట్లాడదాం అని అనుకున్నాడు కానీ , టైం లేదు. రోజు రోజుకీ ఉద్యోగం తనతో మాటలు కూడా లేకుండా చేస్తోంది అని లోలోపల తిట్టుకున్నాడు. అన్ని రకాల ఇంస్ట్రుక్షన్స్ తీసుకున్నాక అసైన్మెంట్ కి రెడీ అయ్యాడు, కాశ్మీరీ లోకల్ భాషలు అయిన పహారి, హిజకో , గొజరీ, కాశ్మీరీ లో కొన్ని పదాలు నేర్చుకుని పెట్టుకున్నాడు.
కాశ్మీరులో భారత బోర్డర్ సరిహద్దు వైపు చేరుకున్నాడు. అక్కడి చిన్న చిన్న మట్టి ఇళ్లలో లోకల్స్ నివశిస్తున్నారు. ఎదురుగా పాకిస్తాన్ చెక్ పోస్ట్, అందులో వారు కూడా బోర్డర్ ని గమనిస్తున్నారు. వీరు కి తెలుసు తనకు ఇచ్చిన అసైన్మెంట్ లో ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చు.
ఇటు పక్కన వీరు ని పంపించడానికి 5 ఆఫీసర్స్ వచ్చి కూర్చున్నారు. ఒక మేజర్ ని పిలిచి వీరు ని చూపించారు. వీరు గురించి అప్పటికే టాప్ సీక్రెట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి, మిలటరీ హెడ్ ఆఫీస్ నుండి. రాత్రి 2 అయ్యింది.అక్కడ నుండి వీరు వెళ్ళడానికి అనువైన సమయం ఇక అది ఒక్కటే. చెక్ పోస్ట్ డ్యూటీ లో