మొండి 35 భూకంపం
telugu stories kathalu novels మొండి 35 భూకంపం మొత్తం మీద బాంబ్ గురించి తెలుసుకున్న విషయాలు అన్నింటినీ రిపోర్ట్ లో రాసి అప్పటికప్పుడే హెడ్ ఆఫీస్ కి పంపించారు టీం వారు. రాత్రి అయ్యింది. ఈ పూటకి ఇక్కడే బస చేసి రేపు పొద్దున్న ఆఫీసుకి పోదాం అని రాజేష్ అన్నాడు. అప్పటికే వీరు కి నిద్ర మత్తు ఫుల్ గా ఎక్కేసింది. దివ్య తో మాట్లాడాలి అనుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు.
ఆ రాత్రి కొన్ని వందల చోట్ల ప్రకంపనలు మొదలయ్యాయి. అక్కడ ప్రశాంతంగా పడుకున్న జీవులు ఆ ముగ్గురు మాత్రమే. ముఖ్యంగా దేశపు రక్షణ శాఖ నుండి హోమ్ శాఖ దాకా ఆ రిపోర్ట్ చేరిపోయింది. ఆయా సంబంధిత అధికారులు ఆ రిపోర్ట్ చూసి షాక్ అవుతున్నారు. ఇంతక ముందు ఎప్పుడూ ఎక్కడా వాడని సరికొత్త రకం పేలుడు పదార్ధాల గురించి తెలుసుకున్నారు. వేరే డ్యాం లు భావనాలకూ ఇలాంటి ప్లాన్ లు ఏమన్నా అవతలి వాళ్ళు వేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మీడియా కి ఈ విషయం చేరవెయ్యాలా వద్దా అన్న విషయం పై చర్చల్లో మునిగారు.