మొండి 34 డ్యామ్ బాంబ్
telugu stories kathalu novels మొండి 34 డ్యామ్ బాంబ్ దానికి సమాధానంగా రాజేష్ " నిజం వీరు. ఇప్పుడు ఈ డ్యాం , దాని వెనుక నీరు ఉన్న ప్రాంతం అంతా ఒకప్పుడు పెద్ద బౌద్ధ నగరం. అక్కడ దొరికిన పురాతన వస్తువులు , నమూనాలు , ఇళ్ళు అన్నింటినీ పురాతత్త్వ శాస్త్రవేత్తలు మరొక చోటికి తరలించాక ఈ భూభాగాలను నీటితో ముంచేశారు. "
" ఎందుకు అలా ? ఇక్కడే ఉంచేస్తే బాగుండు కదా . రూట్ మార్చొచ్చు గా "
" అదొక మిస్టరీ. ఇంజనీరింగ్ వాళ్ళు ఏదో రీజన్ చెప్తూ ఉంటారు. సర్లే , అసలు విషయం మరిచిపోయినట్టు ఉన్నాం "
" అవును రాజేష్ ! అసలు ఎక్కడ నుండి పట్టుకుంటే క్లూ దొరుకుతుందో " అని వాపోయాడు వీరు.
మాటల మధ్యలో రాజేష్ దగ్గరున్న సెల్ మోగింది. అవతల, ప్రొఫెసర్ దేబేంద్ర. కాసేపు మాట్లాడక వీరు కి ఫోన్ ఇచ్చాడు రాజేష్.
" వాట్ మై బాయ్. ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా "
వెనకాల బస్సు సౌండ్. పెద్దగా హార్న్ వేస్తున్నాడు. వీరు అటు ఇటు ఆ సౌండ్ నుండి తప్పించుకోవడానికి తిరిగాడు.
" సార్ . ట్రై చేస్తున్నాం సార్ . ఏమి క్లూ దొరకడం లేదు "
మళ్ళీ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లెమ్.
" హ్మ్ . చండేకర్ ఏమంటున్నాడు ?"
ఎక్సప్లోజివ్ ఎక్స్పర్ట్ అయిన చండేకర్ ని తీసుకువచ్చాడే కానీ, ఇప్పటిదాకా అతని నుండి సరిగ్గా ఎలాంటి ఇంఫార్మేషన్ అడిగి తెలుసుకోలేదు వీరు.ఇంతలో పక్కనే పిల్లలు ఆడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని తరుముతూ ఒక అవ్వ. ఆ సౌండ్ డిస్టర్బెన్స్ కి పక్కకి వచ్చి మాట్లాడుతున్నాడు వీరు.
" సార్ . టెన్షన్ లో ఆయన్ని ఏమి అడగలేకపోయాను సార్ "
" ఇదేనా వీరు స్పెషల్ ఏజెంట్ ట్రైనింగ్