మొండి 32 ప్లాట్ ఫారం
telugu stories kathalu novels మొండి 32 ప్లాట్ ఫారం కారు దిగిన వీరు ని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోయాడు రాజేష్. స్టేషన్ కి పక్కన ఉన్న సందుల గుండా... కాసేపటి పాటు రైల్వే ట్రాక్ పక్కన నడిపించాడు. ట్రైనింగ్ లో భాగంగా రూట్లు గుర్తుపెట్టుకోవడం బాగా అలవాటు అవ్వడంతో అన్ని గుర్తులు గమనిస్తున్నాడు వీరు. దాదాపు ఒక కిలోమీటరు రైల్వే ట్రాక్ వైపు నడవగా వచ్చింది ఒక చిన్న బ్రిడ్జ్ కింద కాలువ. ఆ కాలువకు ఒక మూల కాస్త దూరం ప్రయాణించాక కనిపించింది ఒక తుప్పు పట్టిన ట్రాక్స్ ఉన్న మార్గం. అటు వైపు రైలు ప్రయాణాలు నిలిచిపోయి చాలా ఏళ్ళయింది అని అర్ధం అయ్యింది వీరూకి.ఆ ట్రాక్ మీదుగా నడుచుకుని వెళ్తూ ఒక చిన్న బిల్డింగ్ వైపు తీసుకెళ్లాడు వీరుని.
అది ఒక బ్రిటీషర్ల కాలం నాటి భవనం. ఒకనాటి రైల్వే స్టేషన్ ఏమో అని అనుమానం వచ్చింది. ఇదే ఒక వింత అయితే వీరు కి సరికొత్త వింత చూపించాడు రాజేష్.. ఆ బంగ్లా లోపలికి తీసుకెళ్లాడు. దుమ్ము వాసన. ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చావ్ అని ఆడిగేలోపల, మరో పని చేసాడు. ఒక సన్నని రూమ్ లో మెట్లు కిందకి ఉన్నాయి. దిగమన్నాడు వీరు ని. సెల్ లో లైట్ ఆన్ చేసుకుని దిగాడు. పక్కన ఉన్న స్విచ్ ఒకటి నొక్కాడు రాజేష్. ఒక పాత కాలం నాటి బల్బ్ ఒకటి వెలిగింది. ఆశ్చర్యం!!
ఒక రైల్వే ప్లేట్ ఫారం కనిపించింది. అండర్ గ్రౌండ్ రైల్వే. దశాబ్దాలుగా ఒక్క మనిషి కూడా అక్కడికి రాకుండా ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది అది. ప్లేట్ ఫారం, రైల్వే ట్రాక్, గోడలు కూలిపోయిన టికెట్ బూత్, దయ్యాల స్టేషన్ అని చెప్పడానికి పక్కా సరిపోతుంది ఆ స్టేషన్. కనీసం 40 క్రితం మొదలుపెట్టి