మొండి 24 మిలటరీ కేసు
telugu stories kathalu novels మొండి 24 మిలటరీ కేసు జీవితంలో మొట్ట మొదటి సారి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాడు వీరు. ప్రొఫెసర్ దేబేంద్ర , రాజేష్ అతనితో పాటు వచ్చారు. డైరెక్ట్ గా దేబేంద్ర కూడా తనతో మిలిటరీ ఆపరేషన్ కి వస్తున్నాడంటే , అక్కడ ఏదో పెద్ద ప్రాజెక్ట్ పని మీదనే అయ్యుండాలి. కానీ , మిలిటరీ ప్రాజెక్ట్ అంటేనే పెద్ద రిస్క్. ఇంత పెద్ద పనులు నేను చేయగలనా లేదా అని తనలో తాను తర్జన భర్జన పడుతున్నాడు వీరు. ఒక్కో సారి నావల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోదాం అని కూడా అనిపిస్తోంది. మరో పక్క తనని రెఫెర్ చేసినందుకు పరువు తీయకూడదని కూడా అనిపిస్తోంది. ఏదైతే అది అనుకుని సైలెంట్ గా
సెక్యూరిటీ ఛాంబర్ దాటి విమానం వైపు వెళ్తున్నాడు.
మాములుగా విమానం లో ఎయిర్ హోస్టెస్ బాగుంటారని చాలా మంది చెప్తుంటారు. కానీ , వాళ్ళు ఎక్కింది ఇండియన్ ఎయిర్ లైన్స్, ఒక పెద్దావిడ వచ్చి దండం పెట్టింది. వీరు కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నోరెళ్ళబెట్టి ఇదేంటి వీళ్ళున్నారు అనుకున్నాడు. తీరా విమానంలోని స్టాఫ్ కూడా అలా పెద్ద వారే కనిపించారు. తుస్సుమని వెళ్లి తన సీట్ దగ్గరకు వెళ్ళాడు. మొదటి సారి విమానం లో ప్రయాణం కదా , కిటికీ పక్కన కూర్చుంటానని రాజేష్ ని అడిగి కూర్చున్నాడు. కిటికీలోంచి విమానం ఎగరడం నుండి దిగే దాకా ఆ సూర్యోదయంలోనే ఆకాశానికేసి చూస్తూ ఆలోచనల్లో మునిగి తేలాడు. కాసేపు దివ్య పక్కన ఉంటె బాగుండు అని కూడా అనిపించింది. ఇలా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ విమానం ఢిల్లీ లో ల్యాండ్ అయ్యింది.
దిగిన వెంటనే అక్కడున్న టాక్సీ ఒకటి పట్టుకుని డైరెక్ట్