మొండి 21 లాప్ టాప్
telugu stories kathalu novels మొండి 21 లాప్ టాప్ అనుకున్నదే తడవుగా ఎలాగైనాసరే రవి సార్ చివరి నిమిషాల గురించి వీలైనంత సమాచారం సేకరించాలని ఫిక్సయ్యాడు. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు( పోలీసులు), ఎలాగో ఆయన కాల్ లిస్ట్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నీ అనలైజ్ చేసి కొంతమంది వరకు పట్టుకుంటారు.
ఒక్కటే తేడా ఏం కొడుతోంది అంటే ఇన్ని సంవత్సరాలు డిపార్ట్మెంట్ లో పనిచేసిన రవి అంత సింపుల్ గా వాళ్ల చేతికి ఎలా చిక్కాడు. పొద్దున కూడా ఒక ఎంప్లాయ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు దీనిపైన డిపార్ట్మెంట్లో ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నార.
మామూలుగా అయితే ఆఫీస్లో వీరు, తనకిచ్చిన పనులు మాత్రం చేయగలడు. కానీ ఇలా పెద్ద పెద్ద విషయాలు నుంచి పెద్ద స్థాయిలో వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ గురించి గానీ పెద్దగా తెలియదు. ఇన్వాల్వ్ అవ్వకూడదు కూడా.
అన్నింటి కంటే ముందు తాను తేలికగా చేయదగ్గ పని ఏదైనా ఉంది అంటే. అది సార్ లాప్ టాప్ ని సంపాదించడం. కానీ, అసలు ప్రాబ్లెమ్ ఏంటంటే ? ఆ లాప్ టాప్ లో ఇంఫార్మేషన్ ని ఇప్పటికే తీసుకుని ఉండి ఉంటే. ఒక వేళ నిజంగానే మన డిపార్ట్మెంట్ లో దొంగలు ఉండి, ఆ లాప్ టాప్ నుండి కీలకమైన సమాచారాన్ని డిలీట్ చేసి ఉంటే . అప్పుడు ఏమి చెయ్యాలి? అసలు పని మొదలు పెట్టకుండానే ఇన్ని అనుమానాలు ఎందుకు అనుకుని వీరు రవి సార్ ఇంటికి వెళ్ళాడు.
"మేడం లాప్ టాప్ లో ఒక ప్రాజెక్ట్ సగం పూర్తయ్యి ఉంది. ఒక్క రోజుకి కావాలి "అని అడిగాడు వీరు.
"అదేంటి అమ్మా. మొన్న కూడా ఇలానే ఎవరో రాజేష్ అనే అబ్బాయి వచ్చి ఇలానే అడిగి వెళ్ళాడు. అప్పుడు లాప్ టాప్ కనిపించలేదు అని చెప్పాను కూడా"
" మంచి పని చేశారు మేడం. నిజంగానే ఎవ్వరికీ ఇవ్వకండి"
" నీకు కూడా ఇవ్వను. పోలీసులకు అప్పచెప్పాలి దీన్ని " అంది ఆవిడ.
వీరికి గొంతు లో కాకరకాయ పడ్డట్టు అయ్యింది.
" లేదు మేడం ! కావాలంటే ఇక్కడే లాప్ టాప్ లో కావలసిన ఫైల్స్ ని తీసుకుని వెళ్ళిపోతాను" అన్నాడు. దానికి అంగీకరించిన రవి భార్య లాప్ టాప్ ఇచ్చింది. కాసేపు పక్కన కూర్చున్న ఆవిడ , లేచి కాఫీ పెట్టడానికి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు అన్న వీరు , దాదాపు 2 గంటలపాటు లాప్ టాప్