మొండి 2 ప్రేమ
telugu stories kathalu novels మొండి 2 దివ్య : నిజం తెలిసే దాకా అందరు తమకు తెలిసిందే కరెక్ట్ అంటారు. వాడేంటో నాకు నిజంగా తెలుసు. ఖచ్చితంగా చెప్పగలను. నేనే వాడికి అప్పుడు యస్ చెప్పుంటే, వాడి లైఫ్ లో ఈ రిస్క్ లు ఏవీ చేసేవాడు కాదు.
సంగీత : నీకు మైండ్ ఫుల్ గా దొబ్బిందే. ఇంకోసారి నా దగ్గర ఆ టాపిక్ ఎత్తమాకే బాబు. అతని ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను నన్ను కూడా జైలు తో పాటు, జాబ్ లోంచి తీసి పడేస్తారు బాస్. ఆ తరువాత నీ ఖర్మ. ఏడువ్.
సంగీత కు చిరాకు వచ్చి వెళ్ళిపోతోంది. వీరు ఏ తప్పు చెయ్యలేదని తనకు మాత్రమే తెలుసు అని దివ్య నమ్ముతోంది. ఒక్క సారైనా అతన్ని కలిసి అడిగి ” నేనేం చెయ్యలేదు ” అని అంటే విందామని అనుకుంటోంది . ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు ఏమన్నా అనుకోనీ , వీరు ని విడిపించాలి.
ఇన్నాళ్లు తాను వీరు ప్రేమను కాదని అన్నప్పుడూ, ఎన్ని సార్లు ఆలోచించినా అనిపించని ఆలోచనలు ఇవాళ వస్తున్నాయి . వీరు ని విడిపించాలి . ఎలాగైనా సరే. ఒక్క సారి వాడు నవ్వుతుంటే మళ్లి చూడాలి. తన భుజం మీద తల వాల్చాలి. దివ్య కి అర్ధం అవుతోంది. she cant live without veeru.
Immediate గా next చెయ్యాల్సిన పనేంటి. లాయర్ శ్రీకాంత్ యాదవ్ అంకుల్ ని అడుగుదామా?? లేదు నాన్నకి చెప్పేస్తాడు. రవీందర్ అంకుల్ ని అడిగితే. చెప్పలేం. ఆయన ఇంత పెద్ద కేసు హ్యాండిల్ చెయ్యలేడేమో. ఎదో చిన్న చిన్న కేసులు తప్ప రిస్కీ కేస్ లు హ్యాండిల్ చేసిన అనుభవం లేదు అతనికి. దివ్య మైండ్ అంతా ఆలోచనలతో నిండి పోయి ఉంది. శివ కి ఫోన్ చేసింది.
***********************************************
అప్పుడే ఒక సాఫ్ట్ వేర్ క్లయింట్ దగ్గర చిన్న వెబ్ సైట్ ప్రాజెక్ట్ పని పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు సాయి కిరణ్ . చాలా రోజుల తరువాత అనంతపూర్ నుండి హైదరాబాద్ వచ్చిన శివ ఇరానీ చాయ్ తాగుదామని గొడవచేస్తే, బరహా కేఫ్ పట్టుకెళ్ళాడు.ఛాయ్ తాగడం మొదలుపెట్టారో లేదో
శివ : ఇంకా ! ఏందిరా సంగతులు
సాయి : చెప్పాలి నువ్వే
శివ : అమ్మాయిలతో మాట్లాడి మాట్లాడి అలవాటైనట్టుంది” చెప్పాలి. చెప్పు. ఇంకా “.
సాయి : నీ అంత కాదు లే. సిస్ట