మొండి 17 పెళ్లి
telugu stories kathalu novels మొండి 17 పెళ్లి ఈలోపలే దివ్య వీరు ని చూసి చెయ్యి ఊపింది. వీరు కూడా వరల్డ్ కప్ గెలిచిన లెవల్లో చెయ్యి తిరిగి ఊపాడు. అందరిలో కలిసిపోయి వీరు పెళ్లి చూస్తూ గడుపుతున్నాడు. పెళ్లి పూర్తయ్యే టప్పటికి రాత్రి అయ్యింది. నెమ్మదిగా అందరూ జారుకుంటున్నారు. ఒక్క వీరు మాత్రం కూర్చుని దివ్య ని అలానే చూస్తున్నాడు. ఉన్నట్టుండి మండపం పక్కన మెట్ల దగ్గర కూర్చున్న దివ్య చేతితో రమ్మని సంజ్ఞ చేసింది. అది కూడా ఎంత ముద్దుగానో. వీరు పిలిచిందే తడవుగా వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో దివ్య ఇప్పుడు క్లాస్ మేట్ కాదు.
" కొంచం పక్కనే ఉండు"
" ఒకే. ఏమైంది ? "
" ఏమి లేదు. మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే నాన్న ఇబ్బందిగా చూస్తున్నారు. నువ్వైతే ఏమి భయపడరు"
" అబ్బో! సరే ! "
" ఓయ్ కామెడీ గా ఉన్నా కాదా ?"
"అలా ఏమి లేదే. నీకుందుకు అలా అనిపించింది "
" అంటే చీర అలవాటు లేదు కదా. నడవలేక పోతున్నాను" అని ముద్దుగా చెప్పింది. దివ్య ని అంత దగ్గరగా చూస్తే , మతిపోతుంది మనిషి అనే వాడికి ఎవరికైనా. అందులోనూ ఆమె పెద్ద కళ్ళు చూస్తూ ఎన్ని గంటలైనా బ్రతికెయ్యొచ్చు.
ఈలోపల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ని బయటకు తీసుకుని వచ్చి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడు. వీరు దివ్య వచ్చి ఆ జంట పక్కన నిలుచున్నారు. అప్పుడప్పుడూ దివ్య భుజం తగులుతోంది. వీరు కాస్త డీసెంట్ గా ఉంటున్నాడు. అయితే , దివ్య జుట్టు దగ్గర మాత్రం వాసన బాగా పరిమళాలు వెదజల్లుతోంది. దివ్య పక్కన ఉన్నాడు కానీ , వెనక నిలబడితేనే బాగుంటుంది అనుకున్నాడు.
ఈలోపల ఈ లోకం లోకి వచ్చి ఒక డౌట్ అడిగాడు.
" ఏమి చూపిస్తున్నాడు "
" అరుంధతి నక్షత్రం. నువ్వు కూడా పెళ్లయ్యాక పెళ్లి కూతురుకి చూపించాలి అంట "
" ఏది ? ఎక్కడుంది " అని అడిగాడు వీరు.
" మా బావ చూపిస్తున్నాడు చూడు "
వీరు నిజంగానే తెలియక బుర్ర