మొండి 16 సీక్రెట్ మీటింగ్
telugu stories kathalu novels మొండి 16 సీక్రెట్ మీటింగ్ " మరీ చిన్న వాడు అవుతాడేమో " అని అన్నాడు ప్రొఫెసర్ దేబేంద్ర.
వీరు ని NIA లోకి శాశ్వతంగా తీసుకునే ఆలోచనలలో మునిగి ఉన్నారు అక్కడి సభ్యులు అందరూ. ప్రొఫెసర్ దేబేంద్ర , ఫోరెన్సిక్ HOD జయంత్ , కమిషనర్ మహేష్ దత్ ఇలా పెద్దలు అందరూ కలిసి చర్చించుకుంటున్నారు.
మహేష్ దత్ : అయితే ఇప్పుడు ఏం చేద్దాం.
దేబేంద్ర : అతన్ని కొన్నాళ్ళు ట్రైన్ చేసి , సెట్ అవుతాడు అనుకుంటేనే మన దాంట్లో పోసిషన్ ఇద్దాం. లేదా , ఎందుకు ఊరికినే.
మహేష్ దత్ : Are there any remarks on his performance side
మధ్యలో అడ్డుకున్నాడు జయంత్
జయంత్ : అతనికి జీవితంలో ఇదొక్కటే గోల్ లా కనిపించడం లేదు. అఫ్ కోర్స్. నిజంగానే ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నాడు. బట్ అతని వర్క్ స్టైల్ unconventional గా ఉంది. మనకు తెలిసి ఇక్కడ అందరూ అలా మొదలయ్యే , తరువాత dumb అయ్యారు.కాబట్టి ట్రైన్ చేసి చూద్దాం. మౌల్డ్ అయితే తీసుకుందాం
మహేష్ దత్ : వీరుని గురించి , ఫోన్ కాల్స్ తో సహా క్రాస్ చెక్ చేసే చెప్తున్నా. హి ఐస్ గుడ్. అతనికి మళ్ళీ సాఫ్ట్వేర్ లైఫ్ మీద ఆసక్తి వచ్చి వెళ్ళిపోతే మనకు మంచి టెక్నీషియన్ మిస్ అవుతాం.
దేబేంద్ర : అక్కడ నుండి కూడా పని చేయించుకోవచ్చేమో.
మహేష్ దత్ : ఇప్పుడు పిల్లలు చూస్తున్నాం కదా దేబేంద్ర గారు. ఒకసారి లూస్ అయితే వెనక్కి రారు. అయినా , ఇలాంటి ఉద్యోగాలు వాళ్లకు అవసరం ఏముంటుంది. వీలైనంత త్వరగా సెటిల్ అయ్యి , దేశాలు తిరగాలి అని ఉంటుంది కానీ.
విషయం ఎక్కడికీ తేలక పోవడంతో కలగజేసుకున్నాడు ఫోరెన్సిక్ హెడ్ జయంత్
జయంత్ : ప్రాబ్లెమ్ ఎక్కడ వస్తుంది అంటే. వీరు చేస్తున్న పనికి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ లేదు. మిలటరీ వాళ్ళ దగ్గర ఉంటారు ఇతని లాంటి వారు. సరే, మన దగ్గర అలా కొత్తగా ఒక డిపార్ట్మెంట్ పెట్టాలంటే మళ్ళీ సెంట్రల్ గవర్మెంట్ నుండి తిప్పలు.
మహేష్ దత్ : సో ! అయితే
జయంత్ : వీరు ని ఈ డిపార్ట్మెంట్ కింద తెలిసే దాకా మనం ఎలాంటి నిర్ణయానికి రాకపోవడం మంచిది. అతనితో కాంట్రాక్ట్ బేసిస్ లో ఇప్పుడున్నట్టుగానే పని చేయించుకుందాం.
దేబేంద్ర : పని చేయించుకోవడం బానే ఉంది. అతని మనకు చేస్తున్న పనులు చాలా