మొండి 11 కాఫీ డే
telugu stories kathalu novels మొండి 11 కాఫీ డే ఎదురుగా వచ్చిన దివ్య ని చూసిన వీరు షాక్ తిన్నాడు. అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏదో చెప్పబోయాడు.
ఆ రోజు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది దివ్య. తన బంగారు రంగు స్కిన్ టోన్ కి ఆ బ్లడ్ కలర్ పంజాబీ డ్రెస్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆమె జుట్టు కూడా ఫ్రీ గా వదిలేసి మధ్యలోకి పాపిడి తీసుకుని , చెవికి రింగులు పెట్టుకుని వచ్చింది.ఆమె కురులు కొంత వరకు భుజాలకు అతుక్కుని ఉన్నాయి. ఎప్పుడూ తనతో పాటు ఉండే దివ్య ఇంత అందంగా ఉంటుందని వీరు కూడా అనుకోలేదు. మిగతా అబ్బాయిలు చూసి చూడనట్టు సైట్ కొడుతున్నారు. పెద్ద పెద్ద కళ్ళేసుకుని తన వైపు చూస్తున్న దివ్య ని చూస్తే వీరు కి మనసు కంట్రోల్ అవ్వడం లేదు. పెదాల మీదకు ఒక విచిత్రమైన నవ్వు తెచ్చుకున్నాడు అతను.
" ఏంటి....... ? హలొ "
అని దివ్య అన్న మాటలకు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు వీరు.
" సార్ మొన్న ఒక ప్రాజెక్ట్ పని మీద తీసుకెళ్లాడు అబ్బా "
" ఓహ్ ఏమి ప్రాజెక్ట్ "
వీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసాడు.
"అవును సడన్ గా వచ్చావ్ ఏంటి ?"
"వచ్చా ! బోర్ కొడుతోంది హాస్టల్ లో "
"ముందు నువ్వు చెప్పు ఏమి ప్రాజెక్ట్" అని అడిగింది. ఇక సమాధానం చెప్పక తప్పదని " ఇంటర్నెట్ లో ఎదో నెట్వర్కింగ్ సంబంధించింది ప్రాజెక్ట్ "
" ఓహ్ ! ఆయన మాత్రం ఆయన పనికి నిన్ను బాగా వాడుకుంటున్నాడుగా "
" చ చ ! అలా ఏమి లేదబ్బా . ఆ ప్రాజెక్ట్ కి కోడింగ్ చేసినందుకు డబ్బులు కూడా ఇచ్చాడు తెలుసా "
" అబ్బో ! కంగ్రాట్స్. నాకు పార్టీ ఎప్పుడు మరీ "
వీరు కి అప్పుడే గుర్తొచ్చింది. ఇన్ని రోజులు దివ్య తో ఉన్నాడు కానీ , ఎప్పుడు కూడా ఒక కాఫీ డే కి వెళ్ళాలి అంటే కుదరలేదు. డబ్బులు ఉంటేగా. మొదటి సారి తన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎదురుగా తన జీవితం ఉంది. ఇంకేం , అస్సలు ఆగకుండా దివ్య ని అడిగాడు.
" ఏదైనా కాఫీ డే కి వెల్దామా "
"ఎందుకబ్బా . నువ్వే ప్రొబ్లెమ్స్ లో ఉన్నావు. ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి అక్కడ వెళ్లడం అవసరమా "
" హలో .. హలో . ఇప్పుడు ఉన్నాయి. ఖర్చుపెడదాం పర్లే "
"నువ్వు ఉండు వీరు. కాస్త డబ్బు రాగానే అలా టెంప్ట్ అయ్యి ఖర్చు