మైకం
naa telugu kathalu “ఎప్పుడు...?'' ఉత్సాహంగా అడిగాడు రాజేష్. అతని మొహంలో సంతోషం... ఏదో సాధించినట్లు కించిత్తు గర్వం కూడా చోటు చేసుకుంది…
“నువ్వెప్పుడంటే అప్పుడే.... నేను రెడీ” అవతలి నుండి స్వప్న మాటలు తియ్యగా వినిపించాయి…
“ఇంకా ఆలస్యం చేయడం నా వల్లకాదు... నువ్వు నా ఆఫర్ ని ఒప్పుకున్నావంటేనే ఇంకా నమ్మలేకపోతున్నాను రేపే కలుసుకుందాం...” అన్నాడు ఆనందంగా రాజేష్....
“అన్నమాట ప్రకారం నేనడిగింది నాకివ్వాలి అదినా చేతిలో పడ్డాకే మిగతావని..”
“ఓ ష్యూర్... తప్పకుండా... నీక్కావలసింది నీకిచ్చాకే నిన్ను నా కౌగిలిలో బంధీ చేస్తాను... అన్నట్టు మరోముఖ్య విషయం అని ఆగాడు రాజేష్...
“ఏమిటది” అంది స్వప్న... కాసేపు మౌనం తర్వాత మెల్లిగా చెప్పాడు రాజేష్... "రేపు...నాతోపాటు నా ఫ్రెండ్ కూడా రొమాన్స్లో పాటిస్పెంట్ చేస్తాడు... “అతని నోట్లో నుండి మాటపూర్తి కాకముందే స్వప్న కోపంగా అంది...
“యూ రాస్కెల్... నువ్వసలు మనిషివేనా...? నా మనసు చంపుకుని నీతో ఒకరోజు గడుపుతానన్నంతమాత్రాన అది అలుసుగా తీసుకుని మరొకడితో కూడా... ఛీ.. ఛీ... అసలు అలా అనడానికి నీకు నోరెలా వచ్చింది... ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి బ్రతికిపోయావు... అదే నా ఎదురుగా ఉండి ఉంటే రెండు చెంపలు వాయించే దాన్ని...” కోపంగా అరిచింది స్వప్న... ఆమె మాటల్ని పట్టించుకోనట్లు కూల్ గా అన్నాడు రాజేష్.... " అలా కోప్పడితే ఎలా బేబి... ఈ మాత్రం దానికే అంతలా రియాక్ట్ అవ్వాలా.... అయినా వన్ బైటు రొమాన్స్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలుసా... ఒక్కసారి అలవాటు పడ్డావంటే... ఇక ప్రతిసారీ ఇద్దరితో..??
"షటప్ యూ బాస్టర్డ్' అవతలి నుండి మొబైల్ ఆఫ్ చేసింది స్వప్న.. రాజేష్ కూడా మొబైల్ ఆఫ్ చేసి రిలాక్స్ గా చైర్ వెనక్కివాలి ఎదురుగా కూర్చున్న స్వరూప్ వంక చూశాడు…
"చాలా హర్ట్ అయినట్టుంది...” అన్నాడు స్వరూప్... రాజేష్ చిన్నగా