మంచి కుటుంబం
naa telugu kathalu మంచి కుటుంబం జయ ఒక సాధారణ కుటుంబం లో పుట్టి పెరిగిన పల్లెటూరి అమ్మాయి పెద్దగా చదువుకోలేదు ఎదో ఆ పల్లెటూరులో ఉన్నంత వరకు చదివింది తెలుగు రాయటం చదవటం చేయగలదు. పదవ తరగతి పూర్తికాక ముందే అదే ఊర్లో వున్నా వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసారు ఆర్ధికంగా బాగా వున్నవాళ్ళు కానీ జయ భర్త అంత తెలివైన వాడు కాదు జయకి బాగా చదువు కోవాలని సిటీ లో ఉండాలని కోరిక కానీ తాను ఎం చెప్పిన తన వాళ్ళు వినకపోగా మంచి సంబంధం అని పెళ్లి చేసేసారు జయకు 18 సంవత్సరాలు నిండకుండానే.....
జయ అత్తగారింట్లోకి వచ్చిన ఆరు నెలల్లోనే మంచి పేరు తెచ్చుకుంది సంవత్సరం తిరగకుండానే ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చింది పెద్దకూతురు సరయూకి. సరయు పుట్టిన రెండు సంవత్సరాలకి జయ అత్తా మామలు తీర్థ్డా యాత్రలకు అని వెళ్లి ఒక ప్రమాదం లో చనిపోయారు అప్పటినుంచి ఇంటిభాద్యత అంత జయనే చూసుకునేది భర్త వున్నా లేనట్టే ఏది పట్టించుకునేవాడు కాదు కొన్ని రోజులకి చిన్న కూతురు సమీరా కొడుకు సందీప్ పుట్టారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుండటం వాళ్ళ చదువుల గురుంచి