మనసున మనసై 8
మనసున మనసై 8 'ఓ అదా అర్ధం అయిందిలే...' ఇంకా ఏదో చెప్పేలోగా జయంతి ఇల్లు వచ్చింది- జయంతి డోరు తెరిచి దిగి 'థాంక్స్ ఫర్ ది లిఫ్ట్- గుడ్ నైట్' అంది దివాకర్ వంక చూసి.... 'ఓ నో.... ఇట్స్ మైప్లెజర్, గుడ్ నైట్' అంటూ కారు ముందుకు ఉరికించాడు. 'ఊ... ఏమిటి చెప్పు ఇందాక ఏదో అంటున్నావు'
'అబ్బా ఏంలేదు, మా ఆవిడ ఉద్దేశం.... వాళ్ళ అక్కయ్య ఏకాంతం మనం పాడుచేశామని....మీ ఇద్దరూ సరదాగా వెళ్ళకుండా మేం పానకంలో పుడకల్లా ఉన్నామని...' హాస్యంగా అన్నాడు. 'అవునా, అంతేనా' అన్నాడు దమయంతితో.
'అసలేమిటి మీ ఇద్దరి సంగతి- ఏదో మేం ఇద్దరం లవర్స్ అన్నట్టు మాట్లాడేస్తున్నారు...'
'లవర్స్ కాకపోయినా అవాలని మా ఆశ, కోరిక....' హాస్యంగా అన్నాడు.
'ఏడిశావులే.... లేనిపోని ఊహలన్నీ నా బదులు నీవే ఊహించేస్తున్నావు. ఒక లేడీతో కలిసి కారులో వస్తే ప్రేమించేసి నట్లేనా.... పట్టుమని మా పరిచయం వారం రోజులేనా కాలేదు- ఇలా ఊదరగొడ్తున్నావు... మాకేంలేదు, మధ్యన నీ గోల ఏమిటి?'
'ఓకే మైబాయ్- టేక్ యువర్ ఓన్ టైమ్. కాని రిజల్ ఫేవరబుల్ గా వుంటే సంతోషిస్తాం- స్నేహాన్ని చుట్టరికంగా మార్చుకుంటే సంతోషిస్తామని చెప్తున్నాను..... ఆపు.... ఆపు మా ఇల్లు దాటిపోయాం!' అన్నాడు కారు డోరు తీస్తూ.
'ఓకే గుడ్ నైట్' అంటూ బయలుదేరాడు దివాకర్.
* * *
యింటికెళ్ళిన జయంతికి చాలా సేపటివరకు నిద్రపట్టలేదు. ఆసాయంత్రం ఆ పార్టీ, ఖరీదయిన వాతావరణం స్నేహపూరిత పరిచయాలు, జోకులు... ఎంతో బాగ అన్పించింది. తను కోరుకున్న జీవితం యిలాంటిదే. యిలా కారుల్లో తిరుగుతూ పార్టీలకి వెళుతూ, స్నేహితుల మధ్య మనసుకి నచ్చిన వారితో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయాలన్న తన కోరిక తీరుపోతుందా. లోయర్ మిడిల్ క్లాసునుంచి అప్పర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసుకి వెళ్ళలేక మధ్య నలిగిపోతూ ఏ కోరికలు ఆశలు తీరక చాలీ చాలని బతుకులతో వంద రూపాయలు ఖర్చుపెట్టాలంటే పదిసార్లు ఆలోచించే జీవితలుప్ జీతాలు ఎంత తెచ్చుకున్నా అవసరాలకే సరిపోతూ లగ్జరీస్ అందని బతుకులు ఓ టి.వి, స్కూటరు, మిక్సి లాంటి నిత్యావసరాలు తప్ప హోటళ్ళు, పార్టీలు, ఖరీదయిన నగలు, చీరలు, కారులు అందుకోలేని నిస్సహాయత తమది. తనకి అలాంటి జీవితం అక్కరలేదు. యిద్దరూ ఉద్యోగస్థులయి మంచి యిల్లు, కారు, కనీసం వారానికో సారి ఏహోటల్ లో వెళ్ళి తింటూ, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు, పిక్నిక్ లు అలాంటి జెవెఇథమ్ కావాలి. దివాకర్ మరీ శ్రీధర్, రాహుల్ వాళ్ళలా డాలర్లలొ ఐశ్వర్యం మద్య మునిగి తేలకపోయినా తమకంటే మంచి అంతస్థుంది. ఆఫీసరు రేంకు, కారు అది వుంది. ఉషారాణి బాగుంటుంది. వాళ్ళ ఫేమిలీకి డబ్బు వుంది కనక అమెరికా సంబంధం వచ్చింది అదృష్టవంతురాలు. తను మరీ అంత ఆశకి పోలేదు, దివాకర్ లాంటి వాడు చాలు తనకి. తన కోరిక