మనసున మనసై 17
telugu stories kathalu novels books మనసున మనసై 17 వంటరిగా పిలిస్తే 'మాడాడీ ఏమంటారో అంటుంది. అస్తమాను పెద్దాయనని పర్మిషన్ అడగాలంటే దివాకర్ కి మొహమాటం అనిపిస్తుంది. రోజుకోసారి ఏదో విధంగా ఫోను చేసి తామిద్దరి మధ్య స్నేహం చేజారకుండా తనవైపునించి ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఒకసారెప్పుడో "నేనే ఫోను చేస్తాను. మీరొకసారి చెయ్యరు" అన్నాడు దివాకర్ అలిగినట్లు మాట్లాడుతూ.
మనీషా నవ్వి రోజు మాట్లాడుతున్నారుగా, ఇంకేం వుంటాయి కొత్త సంగతులు మాట్లాడడానికి అంది. 'అంటే నేను చెయ్యకపోతే మీరు చేస్తారా' అన్నాడు ఆశగా కవ్విస్తూ 'అవసరమైతే ఎందుకు చెయ్యను' అంది.
'అంటే ఏదన్న అవసరం లేకపోతే ఫోను చెయ్యకూడదా. నేను అవసరం వుండే చేస్తున్నానా. మీస్నేహం కోసం .... మీతో మాట్లాడాలని కదా నేను రోజూ చేస్తున్నాను' అన్నాడు. మనీషా ఏం మాట్లాడలేదు. ఏం జవాబివ్వాలో తట్టనట్టు వూరుకుంది. 'నాకనిపించినట్టు మీకనిపించదా...' అన్నాడు మళ్ళీ రెట్టించి.
"ఏమిటి అనిపించడం" అంది మనీషా నెమ్మదిగా.
"అదే! నాతో మాట్లాడాలని' సరదాగా కాసేపు మాట్లాడుకుందామని...' ఆశగా అన్నాడు.
మళ్ళీ అవతలి నుంచి మౌనం. ఆమె సమాధానం మౌనం అని అర్ధం అయ్యాక ఆ ప్రసక్తి మానేసి, 'ఈ ఆదివారం లంచ్ కెడధామా, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి' అన్నాడు.
మనీషా మామూలు పాటే పాడింది. 'డాడీ.... మమ్మీ' అంటూ.
"కమాన్ మనీషా, మీరింత పెద్ద అయ్యారు. ఇండిపెండెంట్ గా బిజినెస్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు మీ అంతట మీరు తెలుసుకోలేరా. ఓరోజు ఫ్రెండ్ తో లంచ్ కో, డిన్నరుకో వెళ్ళడానికి పర్మిషన్ కావాలా- రాత్రి అయితే మీ పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టవచ్చు- అందుకే లంచ్ కి అంటున్నాను..."
'సన్ డే ఇంట్లో వుంటాగదా. మమ్మీకి చెప్పకుండా ఎలా వెడతాను' మనీషా గొణిగింది.
'పోనీ వీక్ డేస్ అయితే అభ్యంతరం వుండదు గదా, మీ బుటిక్ నించి లంచ్ టైములో వెడదామా?" మనీషా కాసేపు ఆలోచించి 'చూద్దాం' అంది. అప్పటికి దివాకర్ ఇంక రెట్టించకుండా వూరుకున్నాడు.
* * *
సోమవారం ఠంఛనుగా వంటిగంటకల్లా మనీషా బుటిక్ చేరుకున్నాడు. మనీషా కాస్త తెల్లబోయింది. 'అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు. వీక్ డేస్ ఓకే అని మీరే అన్నారుగా' మనీషా ఇబ్బందిగా చూసింది.
'ఇవాళే అనుకోలేదు' అంది కాస్త అయిష్టంగా.
'దీనికి పెద్ద ప్రోగ్రాం ఏముంది- పదండి అలా కాసేపు ఎటో వెళ్ళి లంచ్ చేసి వద్దాం' మనీషా ఇంకే అనలేక తన అసిస్టెంట్ తో చెప్పి, క్యాష్ డ్రాయరు తాళం వేసి బ్యాగు పట్టుకుని నడిచింది.
హోటల్ లొ ఆర్డరు ఇచ్చాక 'ఏమిటి మీరలా ఇబ్బందిగా వున్నారు. బలవంత పెట్టానని అనుకుంటున్నారా' దివాకర్ మాటల్లో దించడానికి మొదలు పెట్టాడు. మనీషా బలవంతంగా నవ్వి 'ఎవరన్నా చూస్తే ఏమంటారోనని'
'అబ్బ మనీషా, మీ ఆడవాళ్ళు చదువుకుంటారు. మోడర్న్ గా వుంటారు. స్వతంత్రంగా సంపాదించి ఎవరి మీదా ఆధారపడని దశకి వచ్చినా ఇంత చిన్న చిన్న వాటికి భయపడతారేమిటి. ఫ్రెండ్స్ తో భోజనం చెయ్యడం తప్పా....?'
'తప్పని కాదు, డాడి మమ్మీకి చెప్పకుండా....' నసిగింది.
'చెప్పండి సాయంత్రం ఇందులో భయానికి