మాయలాడి 2
telugu stories kathalu novels మాయలాడి 2 ”భలేవారే… మీరు మెంటల్ గా బాగా అప్ సెట్ అయినట్టున్నారు. కాఫీ త్రాగితే కాస్త రిలాక్స్ అవ్వచ్చు…. అన్నట్టు నేను కూడా మీరు ఎక్కాల్సిన బస్సే ఎక్కాలి….” అన్నాడు నవ్వుతూ….
”ఏ ఊరు మీది?” అంది ఠక్కున తనూజ.
చెప్పాడతను…
అప్పుడు ఆమెకి అతనిపై నమ్మకం కలిగినట్లు… ”సరే పదండీ…” అంటూ అతని వెనకాలే అడుగులేసింది… బస్టాప్ లో ఓ ప్రక్కగా ఉన్న హోటల్ లోకి నడిచారు ఇద్దరూ….
”అబ్బే వద్దండీ … కాఫీ చాలు….” అంది ఆమె.
ఆమెని మరీ బలవంతం చేయకుండా రెండు కాఫీ ఆర్డర్ చేసాడు ప్రవీణ్. బేరర్ కాఫీ తీసుకు రావడంతో ఇద్దరూ సిప్ చేయడం ప్రారంభించారు. ప్రవీణ్ దొంగచాటుగా ఆమె మొహాన్ని చూస్తూ మురిసిపోతున్నాడు…. కాఫీ వరకూ వచ్చిన దాన్ని కౌగిలి వరకూ తీసుకు వెళ్ళడం పెద్ద కష్టం కాదులే అని మనసులో అనుకున్నాడు….. అంతలోనే బస్సు హారన్ వినిపించగానే కంగారుగా ఇద్దరూ హోటల్ లో నుండి బయటకు వచ్చారు. తామెక్కవలసిన బస్సే కావడంతో గబ గబా బ్యాగుల్ని చేతుల్లోకి తీసుకుని అక్కడికి పరుగుతీశారు.
ప్రయాణీకులు చాలా మందే ఉండడంతో తన జేబులో ఉన్న కర్చీఫ్ ని తీసి దిగుతున్న ఒకతనికి అందిచి ఒక సీట్లో వేయమని చెప్పాడు… అతడు కండక్టర్ కూర్చునే సీటుకి వెనకాలసీట్లో ఆ కర్చీఫ్ ని వేశాడు. ఆ తర్వాత ఆమె దగ్గిరిగి వచ్చాడు. మీరేం కంగారు పడకండి. మనకి సీటు దొరికినట్లే