మాయలాడి 1
telugu stories kathalu novels మాయలాడి 1 ఈ మధ్య కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు. అందమైన అమ్మాయిలూ వచ్చి ప్రయాణీకుల బ్యాగులను తస్కరించి వెళుతున్నారంట…”
”ఏమిటో మగవాళ్ళే అనుకున్నాను…. ఇలా ఆడవాళ్ళు కూడా దొంగతనాలకి ఎగబడితే ఇక ఎవరిని నమ్మేది…?”
”ఈ రోజుల్లో ఒకరిపైన నమ్మకం పెట్టుకొని నిశ్చింతగా ఉండగలమా…? దేనికైనా ఆ దేవుడిపైన భారం వేసుకోవాలి….”
”ఒంటరిగా అబ్బాయి వున్నా కష్టమే. అమ్మాయి ఉన్నా కష్టమే, ఎవరికీ భద్రతా లేకుండా పోతోంది….”
”వెధవ బస్సులు ఒక్కటీ సరైన సమయానికి రావు. ఈ బస్టాపుల్లో నిలబడితే ఎక్కడ నుండి ఏ దొంగ వెధవ వచ్చి చేతిలో ఉన్న బ్యాగుల్ని తస్కరిస్తాడోనని భయంగా ఉంటేనూ….” చిరాకుగా అన్నాడు మరొక ప్రయాణికుడు.
”బస్సేక్కగానే భద్రతా ఉందంటే సరిపోదు. ఇప్పుడు పగలూ, రాత్రీ అనకుండా బస్సులను నిర్మానుష్య ప్రదేశాలకి వెళ్ళగానే దొంగలు బస్సాపి ఉన్నదంతా దోచుకుంటున్నారు”
”అవునవును… ఇంట్లో నుండి బయటకు వచ్చామంటే…. మల్లీ ఇంట్లోకి వెళ్ళే వరకూ ప్రాణగండమే….” అక్కడ వున్న ప్రయాణీకులు మాట్లాడుకుంటున్న
మాటలన్నింటినీ వింటుంది తనూజ… ఇరవై సంవత్సరాలుంటుంది… పట్టుకుంటే జారిపోయేటంత మెత్తటి పాలలాంటి శరీరంతో… యవ్వనం తెచ్చిన కొత్త కాంతుల్ని సింగారించుకుని … అద్భుతమైన అందాలతో ఎంతో ముద్దుగా కనిపిస్తుంది ఆమె. కానీ ఆమె కళ్ళలో మాత్రం ఏదో బేలతనం… ఆమె చేతిలో ఉన్న ఒక బ్యాగ్ గట్టిగా గుండెలకి హత్తుకుని భయం భయంగా చుట్టూ చూస్తోంది…. సరిగ్గా అప్పుడే ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆమె ముందుకి ఒకతను ప్రత్యక్షం కావడం, క్షణాల్లో ఆమె చేతిలో బ్యాగుని లాక్కుని ఆ వ్యక్తి ముందుకి పరుగు తీయడం కళ్ళు