మాయదారి 3
telugu stories kathalu novels మాయదారి 3 మల్లికి గుండెలో నుండి వణుకు పుట్టింది…. తను అనుకున్నంతా అయ్యింది…. ”ఈ తాగుబోతు ముండాకొడుకులు నా గురించి ఏమో మాట్లాడుకుంటున్నారు….”మనసులో అనుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళి నర్సిగాడి గురించి అడిగింది…. ఎప్పుడూ అక్కడికే వస్తుండడంతో నర్సిగాడిని ఆ షాపువాళ్ళు గుర్తుపడతారు.
”అప్పుడే వచ్చి వేళ్ళాడే…” అన్నాడు షాపతను….
మల్లికి మరింత కంగారు పట్టుకుంది… అప్పుడే వెళ్ళిన వాడు ఇంటికి రాకుండా ఇంకా ఎక్కడికి వెళతాడు అనుకుంటూ మెల్లిగా వెనక్కి తిరిగింది. మల్లి అంత చీకట్లో ఆ షాపు దగ్గరికి ఒంటరిగా ఎందుకు వచ్చిందో అర్థమయింది ఇందాక మల్లి గురించి మాట్లాడిన వారికి… తన మొగుడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి కంగారు పడి ఇక్కడికోచ్చిందన్నమాట… వెంటనే వాళ్ళకి ఓ ఆలోచన వచ్చింది. కంగారుగా గబ గబా అక్కడినుండి వెళుతున్న మల్లిని చూసి అందులో ఒకడు మరొకడిని చూసి కన్నుగీటాడు.
‘అరె… నర్సిగాడి కోసం వచ్చినట్టుందిరా… వాడీ టైంలో ఇక్కడెందుకుంటాడు…” నవ్వుతూ అన్నాడు ఒకడు.
తన వెనకాల నుండి ‘నర్సిగాడి’ గురించి వినపదేసరికి చివుక్కున వెనక్కి తిరిగి చూసింది మల్లి. అక్కడ నలుగురు కనిపించారు. ”నర్సిగాడు నీకేమౌతాడు” అడిగాడు అందులో ఒకడు.
”ఆడి పెళ్ళాంనండీ!ఆడు మీకు యాడన్నా కనిపించాడా?” అడిగింది మల్లి ఆశగా…
”ఆ కనిపించాడు… ఎల్లమ్మగుడి ఎనకాల యాపచెట్టుక్రింద ఫుల్లుగా త్రాగి పడిపోయాడు” అన్నాడు ఒకతను….
అతని మాటలు విన్న మల్లి మరింత కంగారు పడిపోయింది…. వారి మాటలు వినడమే ఆలస్యం అటువైపు కదిలింది మల్లి…. తనమాటల్ని నమ్మి చీకట్లో గుడివైపు వెళుతున్న మల్లిని చూసి వికృతంగా నవ్వాడు వాడు. వాడితో పాటు మిగతా ముగ్గురు కూడా మల్లి వెనకాల చీకట్లో అనుసరించడం