మాయదారి 1
telugu stories kathalu novels మాయదారి 1 ”మళ్ళీ తాగోచ్చాడు మాయదారి సచ్చినోడు” తన మొగుడు గుడిసెలోకి తూలు కుంటూ వస్తూ ఉండడం గమనించి విసుక్కుంది మల్లి.
”ఒసేయ్ మల్లి… నీ యవ్వ… ఈ రోజు చేపల పులుసు పెట్టు… అదిరిపోవాలి దాని వాసన…” అంటూ చేతిలో ఉన్న పెద్ద చేపని ఆమె ముందు పెట్టాడు నర్సిగాడు.
”పొద్దున్నుండీ కూలి పని సేసి, ఇట్టా తాగోత్తే ఎత్తాగయ్యా… కూసిన్ని పైసలు జమ చేస్తే మనకే కదా మిగిలేది. ఇప్పుడు తాగోచ్చింది కాక ఈ చేప తెచ్చినవ్… మంచిగా పులుసు పెట్టమంటున్నావ్. మరి చేపల కూర వండడానికి కావలసిన సరుకులు లేవు” అంది విసుక్కుంటూ మల్లి.
‘నీ యవ్వ… ఇంట్లోకి వస్తే చాలు. నీ లోల్లితోటి నా దిమాక్ ఖరాబ్ జేస్తావ్, అరె…పైసలు ఇయ్యాల గాకుంటే రేపు సంపాదిస్తా. జిందగీని ఖుషీ చేయాలే… నీకేం తెలుసు పల్లెటూరి మోద్దువి” అంటూ ఎద్దేవా చేశాడు నర్సిగాడు.
వాడి మాటలకి మల్లికి చిర్రెత్తుకొచ్చింది. ”జిందగీ ఖుషీ చేసుకుంటావ్… ఇంట్లో కుండలు కొట్టాడుతుంటే నువ్వేమో ఖుషీ ఖుషీ అంటూ కష్టపడ్డ సొమ్మంతా గిట్ల తాగుడుకే పెడితే రేపు మనం బజార్లో అడుక్కు తినాల్సొత్తది” అంది కోపంగా.
నర్సిగాడు పెద్దగా నవ్వాడు మల్లి మాటలకి. ”నీ యవ్వ… నువ్వుండంగ నాకు అడుక్కు తినేంత ఖర్మ ఎట్టా వత్తాదే… నాను పంజేసిన పైసలు నా తాగుడుకు బోతే నువ్వు పంజేసిన పైసలు ఇంట్లకే వట్టాయి కదనే…. అయినా మొగుడు సుఖం కోరే పెళ్ళాలని జూసిన గాని గిట్ల మొగుడు ఇంట్లకి రాంగనే లోల్లిజేసే దాన్ని నిన్నే జూస్తన్న” అన్నాడు నర్సిగాడు విసుక్కుంటూ.
”నీ తోటి లోల్లిజేయ్యడానికి నాకెట్ల మనసయితది మావా… నువ్వు మంచిగుంటే నిన్ను తిట్తాని నేనెట్ట అనుకుంటాను మావా…” అంది బాధగా మల్లి.
”గిప్పుడు నేను మంచిగ లేకుంటే ఎట్లున్ననే నీ యవ్వ… ఇంకా తాగుడంటావా – మీసమోచ్చిన ప్రతీవోడు మందేస్తున్నాడు… గియ్యాల రేపు ఇది పేషనే… అయినా నేనేమన్నా తాగొచ్చి నిన్ను తంతున్ననా యేందీ….?” అన్నాడు నర్సిగాడు.
”నీకట్టాగే ఉంటది మావా. కానీ నువ్వు మందేసుకొచ్చి నా పక్కన పక్కల పండుకుంటే నాకు వాన్తోచ్చినట్టు అయితది తెలుసా…?” అంది మూతి