కామాంధుడి కిరాతకాలు
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు అతడి కళ్ళు అయస్కాంతాలు.. పైగా అతడు ఆరడుగుల అందగాడు.అతని చూపుల్లో చూపు కలిపిన ఎవ్వరైనా మెస్మరైజ్ అయిపోతారు.. వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు.ఎదుటివాళ్ళు అలా మైమర్చిపోయిన క్షణాల్లో అతడు "డేంజరస్ గై"గా మారతాడు.అలాంటి డేంజరస్ గై అమ్మాయిలకి తారసపడితే...సుబ్రహ్మణ్యపురం.. పక్కా పల్లెటూరుకీ, పట్నానికీ మధ్యస్తంగా ఉండే ఓ గ్రామం. రాత్రి ఏడు గంటలవుతోంది సమయం. ఆ రోజు అమావాస్య.ఇళ్ళల్లోని లైట్లన్నీ ఒక్కొక్కటిగా ఆరుతున్నాయి. ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వీధులన్నీ కూడా కళ్ళు పొడుచుకు చూసినా కానరాని కారడవి మాదిరిగా ఉన్నాయి. ఆ ఇళ్ళన్నిటికీ దూరంగా ఉన్న వీరనాగుడి గుడి దగ్గర చీకటి మరింత చిక్కగా ఉంది.ఆ అమావాస్య చీకట్లో, గుడి పక్కనున్న పచ్చికలోంచి కోడెవయసు తాచుపాము బుసల్లాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు గొంతుకల్లోంచి ఎంతో గాఢంగా వెలువడుతున్నాయి.ఆ కటిక చీకట్లో మనవరాలిని వెతుక్కుంటూ