కామాంధుడి కిరాతకాలు 7
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 7 అంతే..! నాగ్‌వీర్ గొంతు చెవిలోకెక్కగానే ఉలిక్కిపాటుతో లేచి కూర్చుంది హాసినీ."హాసినీ.. ఎప్పుడు వెళ్ళిపోయావ్..!? నన్ను నిద్ర లేపితే, డ్రాప్ చేసేవాణ్ని కదా. సేఫ్‌గా వెళ్ళావా.. టెన్షన్ పడ్డాను. సారీ హాసినీ. బాగా నిద్ర పట్టేసింది.." అని బద్దకంగా అన్నాడు నాగ్‌వీర్.ఇంకేం మాట్లాడతాడా అని వింటోంది హాసినీ."నిద్రపోతున్నావా.. డిస్ట్రబ్ చేసినట్టున్నాను.. ఓకె. గుడ్‌నైట్. బై.." అని అటు నుంచి ఫోన్‌కాల్ కట్ చేశాడు.అతనేదో రియలైజ్ అయ్యి, తప్పు చేశానంటూ సారీ చెప్తాడని ఎదురు చూస్తున్న హాసినీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. చేసిన తప్పుకి సారీ చెప్పకుండా, నిద్రపోయినందుకు సారీ చెప్పి కట్ చేసేశాడేంటీ అని ఆశ్చర్యపోయింది.బాగా ఆలోచించిన తర్వాత.. అసలతను చేసింది తప్పు అని అనుకుంటున్నాడా, లేదా అని ఆమెకే పెద్ద డౌటొచ్చింది. దానికి సమాధానం కూడా కష్టపడకుండా వెంటనే దొరికేసింది.'అతను చేస్తున్నదాన్ని తాను వ్యతిరేకిస్తే, వద్దని