కామాంధుడి కిరాతకాలు 28
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 28 మనీష స్కూటీ విజయవాడ సిటీ అవుట్ స్కట్స్‌లోకి ఎంటర్ అయ్యేసరికి చీకటి పడడం మొదలైంది. మరో అరగంటకి మొగల్‌రాజపురం మెయిన్ రోడ్‌ని దాటింది.
బాగా విశాలంగా ఉన్నాయి వీధులు. దానికి తోడు రోడ్డుకి రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు..
వాళ్ళ ఏరియాలోకి వచ్చాక మనీష దృష్టి క్యాజువల్‌గా మారింది. అందుకే ఆమెని ఫాలో అవుతున్న వ్యక్తిని అస్సలు గమనించలేదు.
ఇంటికి వెళ్ళగానే ముందు నాగ్‌వీర్‌కి ఫోన్ చెయ్యాలి అని ఎంతో హుషారుగా అనుకుంది. అసలు ఈ పాటికే తాను వచ్చినట్టు నాగ్‌వీర్‌కి సత్యవర్ధని చెప్పేస్తుందేమో అనుకుంటూ, నాగ్‌వీర్ నుంచి ఫోన్ కాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది మనీష.
ఆ ఆలోచనల్లో ఉండడం వల్ల.. ఒక్కసారిగా స్పీడై క్షణంలో మనీష ముందుకి దూసుకొచ్చిన బైక్‌ని పట్టించుకోలేదామె. కానీ, ఆ బైక్ ఎంత వేగంగా దూసుకొచ్చిందో అంత సడెన్ డిస్క్ బ్రేక్‌తో ఒక్కసారే ఆగింది. తన ముందు సడెన్‌గా ఆగిన బైక్‌ని చూసి అధాటుగా స్కూటీ ఆపింది మనీష.
ముక్కూ, మూతి కర్చీఫ్‌తో కవర్ చేసుకుని ఉన్నాడో వ్యక్తి. సైడ్ స్టాండేసి బైక్ మీంచి దూకినట్టుగా వచ్చి మనీష బైక్ ఇగ్నీషన్ ఆపి తాళాన్ని లాగేశాడు. ఆ వెంటనే ఒక్క ఉదుటున మనీషని గట్టిగా చుట్టి నోరు నొక్కేశాడు. అదే క్షణంలో ఆమె ఎదురు తిరక్కుండా రెండు చేతుల్నీ వెనక్కి విరుస్తూ పట్టుకుని, "నాగ్‌వీర్ లాకెట్ ఇచ్చేయ్.." అని అతికౄరంగా అన్నాడు.
"ఎ..వ..ర్ను..వ్.." గింజుకుంటూ ఏదో మాట్లాడబోయింది మనీష.
అంతే.. పెన్‌నైఫ్ తీసి విసురుగా మనీష మెడ మీద పెట్టాడు. గొంతుని తాకిన నైఫ్‌ని చూసి షాకై పెనుగులాడడం ఆపేసింది మనీష. ఆ పదునైన కత్తి అప్పటికే ఆమె మెడ మీద గాయం చేసేసింది.
"లాకెట్ ఇచ్చేస్తే ప్రాణాల్తో ఉంటావ్.. లేదా నిన్ను ఇక్కడే ఫినిష్ చేసేస్తా.." చంపడానికీ సిద్ధపడినట్టు అన్నాడు.
అంతే.. వాడు డబ్బు కోసమో, జ్యువెలరీ కోసమో ఎటాక్ చేసిన దొంగ కాదని మనీషకి అర్థం అయిపోయింది. 'పర్టిక్యులర్‌గా నాగ్‌వీర్ లాకెట్ కోసమే ఎటాక్ చేశాడు. అంటే.. నాగ్‌వీర్ గొలుసు