కామాంధుడి కిరాతకాలు 27
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 27 "ఆ లాకెట్‌కీ పెళ్ళికీ సంబంధం ఉంది. నువ్ మన్‌డే ఊళ్ళోకి రాగానే కలువ్. బ్యాంక్‌కి వెళ్ళే ముందే ఆ లాకెట్టు గొలుసు నా చేతిలో పడాలి. అర్థమైందిగా. ఇంక వెళ్ళు.." అని కమాండ్ చేస్తున్నట్టుగా చెప్పాడు ఫణీందర్రాజు.
"అలాగే" అని వెనక్కి తిరిగింది ఈషా. అలాగే అని ధీమాగా అయితే చెప్పిందిగానీ మనీష దగ్గర నుంచి ఆ లాకెట్ గొలుసు తిరిగి సంపాదించగలనా అని ఎంతో టెన్షన్‌గానే వుందామెకి.
మనసులోనే అనేక రకాల స్కెచ్‌లు వేస్తూ, ఎంతో పకడ్బందీ ప్లానుల్ని ఆలోచిస్తూ, అక్కడ నుండి వెనుతిరిగింది ఈషా.
* * *
నాగ్‌వీర్ ప్రపోజల్ ఆ రాత్రంతా మనీష మనసుని అతలాకుతలం చేసేసింది. అతడి గురించి ఇప్పటివరకూ తెలుసుకున్న విషయాలే కాకుండా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా అనిపించింది. అంతే.. మంచం మీద నుంచి దిగకుండానే నైమీకి ఫోన్ చేసింది.
"గుడ్‌మోణింగ్.." అటు నుంచి బద్దకంగా నైమీ గొంతు.
"గుడ్‌మార్నింగ్ నైమీ.. పొద్దున్నే డిస్టర్బ్ చేశానా.." అనడిగింది మనీష.
"నోనోనో.. అదేం లేదు. కమాన్.. టెల్‌మి. వాట్ హ్యాపెండ్.."
"ఏం లేదు. చిన్న డౌట్. నాగ్‌వీర్ నిన్ను పెళ్ళి చేస్కుంటానన్నాడు కదా. అది ఎప్పుడు..? ఆ రోజు నైట్ క్యాంప్‌ఫైర్‌లో జరిగిన ఆ మేటర్‌కి ముందా.. లేక తర్వాతా.." తెలివిగా చీకట్లో రాయేసింది.
"నాగ్‌వీర్ నన్ను మ్యారేజ్ చేస్కుంటానన్నాడని నీకెవరు చెప్పారు.." నైమీలో విస్మయం.
"వీరూని మ్యారేజ్ చేసుకోవడం కోసం చాలా ఎదురు చూశాను అన్నావ్..?"
"ఎస్.. నేను అనుకున్నాను. కానీ నాగ్‌వీర్ నన్ను మేరేజ్ చేసుకుంటానని నాతో ఎప్పుడూ చెప్పలేదు.." అని క్యాజువల్‌గా చెప్పింది నైమీ.
నైమీ మాటలకి ఖంగు తింది మనీష. "బైమిస్టేక్ అనుకుంట.. నేనే పొరపాటు పడ్డాను. సారీ నైమీ. ఉంటాను.." వెంటనే కాల్ కట్ చేసింది.
ఆ వెంటనే మళ్ళీ ఫోన్ కాంటాక్ట్స్‌లోకెళ్ళి శిల్పకీ