కామాంధుడి కిరాతకాలు 23
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 23 "నాగ్వీర్ పేరెంట్స్‌కి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే వీరనాగుడి గుడిలో మొక్కుకున్నారట. ఆ తర్వాత.. ఆ పాము చనిపోయిన రోజునే అతను పుట్టడంతో, వీరనాగ పేరుని నాగవీర్గా అతనికి పెట్టారట. ఈ రోజుకీ పిల్లలు పుట్టని భార్యాభర్తలు వీరనాగుడి గుడికి వెళ్ళి అక్కడున్న విగ్రహాన్ని చూసొస్తే, పిల్లలు పుడతారట. నేను మధ్యాహ్నం ఆ గుడికి వెళ్ళినప్పుడు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చాలా మంది కపుల్స్‌ని అక్కడ చూశాను.." అని ఒక సెకన్ ఆపింది మనీష.
"పాముకి మొక్కుకుంటే పిల్లలు పుట్టే గాడ్‌పవర్ ఉందని ఒక డాక్టర్వైన నువ్వు నమ్ముతున్నావా..." సీరియస్‌గా అడిగాడాయన.
"గాడ్ పవర్ గురించి మాట్లాడేటంత పెద్దదాన్ని కాదు సర్. కానీ రెండు పాములు ఇలా అల్లుకున్న అతి పెద్ద శిలా విగ్రహాన్ని చూస్తే.. ఆ భార్యాభర్తల్లో కూడా ఇంటర్నల్‌గా కొన్ని శృంగారపరమైన కోరికలు కలుగుతాయని మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నాను.." చెప్పిందామె.
దాన్ని కొట్టి పారెయ్యలేనట్టుగా సంశయిస్తూనే తలూపాడాయన.
"పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు పుట్టడం లేదని హాస్పిటల్‌కి వస్తున్న ఎంతో మంది లేడీస్‌కి మా ఫస్ట్ క్వశ్చన్.. వారంలో ఎన్ని రోజులు శృంగారంలో పాల్గొంటున్నారు అని. నెక్స్ట్ డైట్ గురించి. ఎందుకంటే పిల్లలు పుట్టనివాళ్ళలో నైన్టీనైన్ పర్సెంట్ ఒబేసిటీ ప్రాబ్లెం. సో దట్.. పీరియడ్స్‌లో రెగ్యులారిటీ లేదు. మేం చేస్తున్న అదే ట్రీట్మెంట్ని వీరనాగుడి గుడిలో చూశాను. బట్ దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఫాస్టింగ్.. ఉపవాసం. ప్రతీరోజూ నైట్స్ ఫుడ్ మానెయ్యాలి, మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవాలి. వీరనాగుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. అదే ఎక్సర్సైజ్. ప్రతీ ఆదివారం కంప్సరీ సుబ్రహ్మణ్యపురంలోని గుడికి వెళ్ళి ఏదో ఒక ప్రాణికి ఆవుకో, పిల్లికో, పిట్టకో ఆహారం పెట్టాలి. అది అన్నిటినీ, అందరినీ ప్రేమించే మంచి గుణం కలిగి వుండడం.. పాజిటివ్ థింకింగ్స్. ఇవే సర్.. పిల్లల కోసం అక్కడకెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా పాటించాల్సిన నియమాలు. వీటన్నిట్లో ఇంటర్నల్‌గా మూఢత్వం కంటే రీజనింగ్, రియాలిటీ, ఒక బెస్ట్ ట్రీట్మెంటే ఎంతో ఎక్కువ కనిపించింది నాకు.." గంభీరంగా చెప్పింది మనీష.
"ఎస్.. అదే కరెక్ట్ అనుకోవచ్చు.." అన్నాడాయన.
"నా నమ్మకం మాటెలా ఉన్నా, ఇంకో ముఖ్య విషయమేంటంటే సర్.. నాగ్వీర్ వాళ్ళమ్మ గారు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు రోజూ ఆ గుళ్ళో కొంత సమయం గడిపి వచ్చేవారట. అదే టైంలో ఒక గోధుమత్రాచు కూడా అక్కడకి వచ్చేదట. ఆ త్రాచుపాముకి ఆవిడ ఎంతో ప్రేమగా గుడ్లు పెట్టేవారట. ఆవిడకి పగలూ రాత్రీ ప్రతిరోజూ ఆ పామే కళ్ళలో మెదిలేదట. ఈ విషయం నాగ్వీర్ వాళ్ళ గ్రాన్డ్మదర్ చెప్పారు.." అంది మనీష.
"ఇది అస్సలు నమ్మశక్యంగా లేదే.." అని పెదవి విరిచాడాయన.
చిన్నగా నిట్టూర్చింది. "నమ్మకాల విషయం ఎలా ఉన్నా హార్మోనల్ రియాక్షన్స్ గురించి మీకు తెలిసిందేగా సర్. ఇట్సాల్సో ఎ సైకలాజికల్ అండ్ హార్మోనల్