కామాంధుడి కిరాతకాలు 22
telugu srories kathalu novels కామాంధుడి కిరాతకాలు 22 అర్ధరాత్రి వచ్చిన భయంకరమైన కల చాలా డిస్ట్రబ్ చేసింది. హ్యాండ్ బ్యాగ్‌లోంచి నాగ్వీర్ లాకెట్ గొలుసుని చేతిలోకి తీసుకుంది. కిటికీలోంచి లోపలకొస్తున్న సూర్యకిరణాలు లాకెట్ మీద పడి అందులోని డైమండ్స్, రూబీలూ మిలమిలలాడాయి.ఒకదానినొకటి అల్లుకుని మెలితిరిగిన ఆ రెండు పాముల లాకెట్ సేమ్ టు సేమ్.. రాత్రి కలలో తనని పాము చుట్టుకున్న మాదిరిలానే అనిపించింది మనీషకి.అంతే..! వీరనాగుడి విగ్రహం చూడడానికి అర్జెంట్‌గా సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలని అప్పటికప్పుడే నిశ్చయించుకుంది.నాగ్వీర్కీ, ఆ గుడికీ గల సంబంధం ఏంటో కనుక్కోవాలి.. దాంతో పాటూ నాగ్వీర్ మెడలో ఉండాల్సిన పాముల లాకెట్ ఈషా దగ్గరకు ఎలా వెళ్ళిందన్నది కూడా కనుక్కోవాలని ఎంతో ఆతృతగా ఉంది. వెంటనే సెల్‌ఫోన్ తీసి, టకటకా ఈషా నెంబర్‌కి ఫోన్ చేసింది.అటువైపు నుంచి.. సండే రాగూడదా అని ఈషా